PSPK’s HariHara Veeramallu: పవన్ కళ్యాణ్ పై ఆశలు వదిలేసిన క్రిష్ – మరో హీరో వైపు చూపు..!

PSPK’s HariHara Veeramallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ), డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్లో చాలా కాలం కిందట హరిహర వీరమల్లు సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. హిస్టారికల్ బ్యాక్డ్రాప్ లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన ఈ సినిమా షూటింగ్ ఆగిపోయి చాలా కాలం అవుతుంది. పవన్ కళ్యాణ్ మొదట ఈ సినిమా స్క్రిప్ట్ లో చేంజెస్ చేయడం కోసం గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ అయిపోవటం వల్ల వీరమల్లు సినిమాపై ఎక్కువ కాన్సంట్రేట్ చేయలేకపోయాడు.

అయితే, ఇప్పటివరకు షూట్ చేసిన కంటెంట్ క్లైమాక్స్ వరకు కూడా పూర్తి కాలేదని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను పక్కన పెట్టయినా పవన్ కళ్యాణ్ మిగతా సినిమాల మీద ఎక్కువ దృష్టి పెట్టడంతో వీరమల్లు ఆల్మోస్ట్ అటకెక్కింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

హరిహరవీరమల్లు స్క్రిప్ట్ మీద చాలా కాలంగా వర్క్ చేసిన క్రిష్ ఇప్పుడు ఇంకో సినిమా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడని సమాచారం అందుతుంది. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల మీద దృష్టి పెట్టడం, ఆ తర్వాత పూర్తి సమయం రాజకీయాలకే కేటాయించనున్న క్రమంలో ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నాడట.

- Advertisement -

ఎలక్షన్ తర్వాత రిజల్ట్ పాజిటివ్ గా వస్తే ఇక హరిహర వీరమల్లు సినిమా కన్ఫార్మ్ గా అటకెక్కినట్టే అనుకోవచ్చు. ఒకవేళ ప్రతికూల ఫలితాలు వస్తే గనక కొంత గ్యాప్ తర్వాత అయినా ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ కెరీర్లోనే మొదటిసారి హిస్టారికల్ బ్యాక్డ్రాప్ లో నటించిన సినిమా ప్లస్ పవన్ కళ్యాణ్ కి మొదటి పాన్ ఇండియా సినిమాగా మొదలైన ఈ సినిమా పూర్తయ్యి రిలీజ్ అవుతుందా లేదా వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు