Game Changer: ఆ సినిమా నిర్మాణంలో కూడా భాగమవుతున్న గ్లోబల్ స్టార్?

RC16 Movie Update

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ మళ్ళీ బిజీ అయ్యాడు. గత కొంతకాలంగా తన కూతురు “క్లిమ్ కార” బర్త్ వల్ల షూటింగ్ లకి దూరంగా ఉన్నాడు చరణ్. ఉపాసనని తన బేబీని చూసుకుంటూ ఫ్యామిలీతోనే గడిపేస్తున్నాడు. అయితే ఇప్పుడు అన్ని రకాలుగానూ ఫ్రీ అయ్యాడు, కాబట్టి త్వరలోనే శంకర్ “గేమ్ ఛేంజర్” సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు. శంకర్ రీసెంట్ గా వేసిన ట్వీట్ లో ఆగష్టు ఫస్ట్ వీక్ లో షూటింగ్ మళ్ళీ స్టార్ట్ చేయనున్నట్టు తెలిసింది.

ఇప్పటికే 70శాతం పూర్తయిన ఈ సినిమా షూటింగ్ సమ్మర్ లో రిలీజ్ అవడానికి రెడీ అవుతుంది. ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తో తన 16వ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఒక స్ట్రాంగ్ బజ్ నెట్టింట వైరల్ గా మారింది. రీసెంట్ గా రామ్ చరణ్ కొణెదల ప్రొడక్షన్స్ కాకుండా, యూవీ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన విక్రమ్ తో కలిసి రామ్ చరణ్ వి మెగా పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ బ్యానర్ లో మొదటి చిత్రంగా నిఖిల్ హీరోగా నటిస్తున్న “ది ఇండియా హౌస్” రాబోతుంది. అయితే రామ్ చరణ్ బుచ్చి బాబు తో తీస్తున్న సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, ఇప్పుడు రామ్ చరణ్ ఆ సినిమా నిర్మాణంలో వి మెగా పిక్చర్స్ ద్వారా సహా నిర్మాణంలో భాగమవుతున్నాడని టాక్ నడుస్తుంది. ఇప్పటికే ఈ విషయమై నిర్మాతలని సంప్రదించినట్టు, వాళ్ళు కూడా అంగీకరించినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే ఈ సినిమా స్టార్ట్ కావడానికి ఇంకో రెండు మూడు నెలల సమయం పట్టేట్టు ఉంది. సినిమా ఓపెనింగ్ జరిగినప్పుడే ఈ బజ్ పై క్లారిటీ రావచ్చు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు