Saindhav: వెంకటేష్ నెక్స్ట్ సినిమా ఆ డైరెక్టర్ తోనా?

Anil Ravipudi is directing Venkatesh’s movie

టాలీవుడ్ లో విక్టరీ హీరోగా వరుస సూపర్ హిట్ సినిమాలు చేసే హీరోగా పేరున్న వెంకటేష్ నుండి ఈ మధ్య కాలంలో సరైన సినిమాలు రావట్లేదు. ఆయన సోలో హీరోగా తన స్థాయి హిట్ కొట్టి పదిహేనేళ్ల పైనే అయింది. గతంలో మల్టీ స్టారర్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టినా, అందులో సగం క్రెడిట్ వేరే హీరోలకి కూడా పోతుంది. అందుకే ఒక స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కోసం వెంకటేష్ చూస్తున్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం శైలేష్ కొలనుతో సైన్ధవ్ చేస్తున్న వెంకీ తన తరువాత సినిమా ఓ కామెడీ స్టార్ డైరెక్టర్ తో చేయనున్నట్టు తెలుస్తుంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు అనిల్ రావిపూడి అని సమాచారం. అనిల్ రావిపూడి ఇప్పుడు బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా దసరా కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అటు వెంకటేష్ కూడా నవంబర్ లోపు సైన్ధవ్ సినిమా పూర్తి చేసి డిసెంబర్ లో రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాడు.

భగవంత్ కేసరి రిలీజ్ తర్వాత నవంబర్ లో అనిల్ సినిమా వెంకటేష్ తో ప్రారంభమవుతుందని చిత్ర వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఈ సినిమా వెంకటేష్ లోని కామెడీ&ఆక్షన్ తో కూడిన మాస్ సబ్జెక్టు అని సమాచారం. కొంతమంది వెంకటేష్ మల్లీశ్వరి తరహా సబ్జెక్టు అని అంటుంటే, మరికొందరు లక్ష్మి తరహా ఫ్యామిలీ, ఆక్షన్ స్టోరీ అంటున్నారు. అయితే ఓవరాల్ గా వింటేజ్ వెంకటేష్ ని గుర్తు చేసే సినిమా అవుతుందని సమాచారం.

- Advertisement -

ఈ రూమర్ లో ఎంత నిజముందో తెలియదు గాని, నిజమైతే మాత్రం ఈ కాంబో లో సాలిడ్ హిట్ పడడం ఖాయం అనిపిస్తుంది. ఎందుకంటే కామెడీ సినిమాలు తీయడంలో దిట్ట అయిన అనిల్ కి వెంకటేష్ లాంటి ఎంటర్టైనర్ ఉద్ధండుడు దొరికితే ఓ రేంజ్ ఫన్ సినిమా రావడం గ్యారెంటీ అని మనకి తెలిసిందే. ఇంతకు ముందు వీరి కాంబోలో వచ్చిన F2,F3 సినిమాలు ఎలాంటి హిట్స్ అయ్యాయో తెలిసిందే. అయితే ఈసారి దానికి మాస్ స్టోరీని జోడించి తీస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ రూమర్ పై క్లారిటీ రావాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు