Prabhas’s Salaar: సలార్, కల్కి – మధ్యలో మారుతి సినిమా..!

Prabhas’s Salaar

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాలార్, కల్కి వంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ని లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత ప్రభాస్ కి సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి వరుస డిజాస్టర్స్ ఉన్న నేపథ్యంలో సలార్, కల్కి సినిమాల కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాల గ్లిమ్ప్స్ ఆకట్టుకోగా సినిమాలపై అంచనాలు పెంచుతున్నాయి. వీటితో పాటు ప్రభాస్ డైరెక్టర్ మారుతితో మరో సినిమా కమిట్ అయ్యాడు. చాలా కాలం కిందట అనౌన్స్ అయిన ఈ సినిమా షూటింగ్ లో ప్రభాస్ ఇంకా పాల్గొనలేదు. ఇటీవల ఈ సినిమా క్యాన్సిల్ అయ్యిందంటూ వార్తలొచ్చాయి. తాజాగా ఆ రూమర్స్ కి చెక్ పెడుతూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఆదిపురుష్ సినిమా రిలీజ్ కి ముందే అమెరికా వెళ్లిన ప్రభాస్ త్వరలోనే ఇండియాకి రానున్నాడని, వచ్చాక సలార్, కల్కి సినిమాలతో పాటు మారుతి సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటాడని టాక్ వినిపిస్తోంది. ఒక పక్క రెండు భారీ బడ్జెట్ సినిమాలు పెట్టుకొని మారుతి సినిమాకు కూడా డేట్స్ ఎలా మానేజ్ చేయగలదని ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ అవసరం లేని సీన్స్ ని ఇతర ఆర్టిస్ట్స్ తో షూట్ చేయటానికి మారుతి ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.మొత్తానికి ఈ సినిమా క్యాన్సిల్ అయ్యిందన్న వార్తలతో ఆందోళన చెందిన డార్లింగ్ ఫ్యాన్స్ కి ఈ న్యూస్ కొంత రిలీఫ్ ఇస్తోంది. మరి, షూటింగ్ కూడా పూర్తి కాకముందే రోజుకొక అప్డేట్ తో అంచనాలు పెంచుతున్న సలార్, కల్కి సినిమాలు ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ ఇస్తాయా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు