Bhagavanth kesari: ఈ డైరెక్టర్ అయినా బాలయ్యలోని ఆ యాంగిల్ ని చూపించగలడా?

Can Anil Ravipudi show that angle in Balayya?

టాలీవుడ్ లో నందమూరి నటవారసుడిగా, నటసింహం బాలకృష్ణ తనదైన శైలిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని రకాల సినిమాలు చేసిన హీరోగా ఈయనకి రికార్డు ఉంది. అయితే బాలకృష్ణ గత 20ఏళ్ళ నుండి ఒకేరకమైన మూస ధోరణి సినిమాలు చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. అందులోంచి అప్పుడప్పుడూ అప్డేట్ అయ్యి ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు బాలయ్య తో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ కొట్టారు.

గత రెండు దశాబ్దాలలో బాలకృష్ణ 25కి పైగా సినిమాలు చేస్తే అందులో కేవలం ఐదు సినిమాలు మాత్రమే హిట్టయ్యాయి. అందులోను బోయపాటి సినిమాలే మూడుండడం విశేషం. అయితే బాలయ్య తో సినిమాలు చేసే ఏ డైరెక్టర్ అయినా బాలకృష్ణ కి ఇమేజ్ కి తగ్గట్టు స్క్రిప్ట్ లు చేంజ్ చేసేవారు గాని, బాలయ్య లో కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేయలేదు. ఇది కూడా ఇన్ని ప్లాపులకి కారణం. ఎంతో కొంత పూరిజగన్నాథ్ తన స్టైల్ లో బాలకృష్ణ ని చూపించాడు. అయితే ఆ సినిమా ప్లాప్ అయింది.

ఇప్పుడు చాలా రోజుల తరువాత బాలకృష్ణ మళ్ళీ మాస్ డైరెక్టర్ తో కాకుండా కామెడీ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు. అనిల్ రావిపూడి తో బాలకృష్ణ చేస్తున్న భగవంత్ కేసరి టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇది కూడా మాస్ సినిమాయే అని చూస్తుంటే తెలిసిపోతుంది. కానీ చాలా మంది సినీ లవర్స్ కి బాలక్రిష్ణని కామెడీ యాంగిల్ లో చూడాలని కోరిక. అప్పుడెప్పుడో 30ఏళ్లకిందట టాప్ హీరో అనే సినిమాలో బాలకృష్ణ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ చేసాడు. రీసెంట్ గా పైసా వసూల్ లో కొత్త బాలయ్యను చూపించాడు పూరి.

- Advertisement -

ఇప్పుడు అనిల్ రావిపూడి కి ఆ ఛాన్స్ వచ్చిందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. కానీ చూస్తుంటే అలా కనిపించడం లేదు. కనీసం ఒక కామెడీ స్కిట్ ఎపిసోడ్ అయినా ఆ సినిమాలో చేయిస్తే బాగుంటుందని కొంతమంది కామన్ ఆడియన్స్ కోరుకుంటున్నారు. అయితే మరికొంతమంది ట్రేడ్ విశ్లేషకులు బాలయ్య నవరసాల్లో ఏదైనా చేయగలడు కానీ, హాస్య రసాన్ని పండించలేడు అని భావిస్తున్నారు. మరి చూడాలి ముందు ముందైనా ఏదైనా ఒక ఎంటర్టైనర్ పడుతుందేమో.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు