Nandamuri Balakrishna: అంతకు ముందు ఆ తర్వాత

నందమూరి బాలకృష్ణ.. అటు రాజకీయ రంగంలోనూ ఇటు సినిమా రంగంలోనూ పరిచయం అవసరం లేని పేరు. ఈ తరం సినిమా ప్రేక్షకులకు తెలియకపోవచ్చు కానీ, ఒకప్పుడు బాలయ్య సినిమాలంటే ఎక్స్‌పరమెంటల్ కి కేరాఫ్ అడ్రస్. కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా, భైరవద్వీపం, ఆదిత్య 369 వంటి సినిమాలు చేసి అప్పట్లోనే మంచి గౌరవాన్ని సాధించాడు బాలయ్య. కానీ, తర్వాత కాలంలో కేవలం కమర్షియల్ సినిమాలపైనే దృష్టి పెట్టి తన పంథాని మార్చుకున్నాడు.

డైరెక్టర్ మాటలకు కట్టుబడుతూ మీసం మేలెస్తే సుమోలు ఎగిరిపోయే, తొడ కొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోయే నాన్ బిలీవ్‌బుల్ సీన్స్ ను కూడా ఎంకరైజ్ చేశారు. సోషల్ మీడియాను ఇప్పుడు విరివిగా ఉండటం వలన ఆ సీన్స్ అన్నీ కూడా ఇప్పుడు మంచి ట్రోల్ కంటెంట్.

ఇప్పడు ఆఫ్ స్క్రీన్ విషయానికి వస్తే, బాలయ్య తన అభిమానులను కొడతాడని, ఆడవాళ్లని తక్కువ చేసి మాట్లాడతాడని, మాటకు ముందు వెనక మా చరిత్ర… మా వంశం అంటాడని, బ్లడ్ బ్రీడ్ అంటాడని ఈ రకమైన ముద్ర బాలయ్యపై గట్టిగా పడింది. కానీ, ఇదంత ఆహా నిర్వహించిన అన్‌స్టాపబుల్ ముందు వరకు ఉన్న అభిప్రాయం.

- Advertisement -

ఏ ముహూర్తాన ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసారో గాని నందమూరి బాలయ్య కెరీర్ ని పీక్స్ స్టేజ్ కి తీసుకెళ్లింది. మామూలుగా బాలకృష్ణ తో మాట్లాడడానికి సెలెబ్రిటీలు కూడా జంకేవారు. అలాంటిది బాలకృష్ణ లోని కామెడీ యాంగిల్, క్యారెక్టర్ ని ఆఫ్ లైన్ లో కూడా పరిచయం చేస్తూ, బాలయ్యలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ ప్రేక్షకులకి తెలిసేలా చేసింది. ఈ షో ద్వారా బాలకృష్ణలో ఉన్న ఒక కొత్త వ్యక్తిని ప్రజలకి తెలిసేలా చేసారు.

షోలో బాలకృష్ణ చేసే కామెడీకి, ఆ పంచ్ లకి, చెప్పే డైలాగ్ మ్యానరిజానికి నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోయారు. ఈ షో తర్వాత కూడా బాలయ్య థింకింగ్ మారిపోయిందని చెప్పొచ్చు.  ఎప్పుడు వంశం గురించే మాట్లాడే బాలయ్య.. ఇప్పుడు టాలెంట్ గురించి మాట్లాడుతున్నాడు. యంగ్ హీరోల టాలెంట్ ను ప్రొత్సహిస్తున్నాడు. అంతే కాదు.. అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని, బాబీ కొల్లి లాంటి యంగ్ డైరెక్టర్స్ అవకాశం ఇస్తూ వారి టాలెంట్ ను కూడా ప్రొత్సహిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ, సిద్ధూ జొన్నల గడ్డ, విశ్వక్ సేన్ లతో బాలయ్య మెంటేన్ చేస్తున్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అలాగే ఇండస్ట్రీలో జరిగే ప్రతి ఫంక్షన్ కు వెళ్లడం, అక్కడ తోటి నటీనటులతో బాలయ్య ఫన్నీగా మాట్లాడటం చూస్తుంటే బాలయ్యలో ఎంత మార్పు వచ్చిందో తెలుస్తుంది. దీనికి తోడు అఖండ సినిమా ఫలితం కూడా  బాలయ్యలో మార్పులు తీసుకువచ్చింది. ఏది ఏమైనా, బాలయ్య వ్యక్తిత్వం పూర్తిగా తెలిసిన తర్వాత కొంత వరకు ఫ్యాన్స్ వార్ ను తగ్గించాడని చెప్పొచ్చు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు