OG: పవర్ స్టార్ కోసం పవర్ ఫుల్ విలన్.. థియేటర్ లో పూనకాలు కన్ఫామ్ !

పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో వస్తోన్న OG సినిమాపై రోజు రోజులకి ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ అన్ని సినిమాలోకెల్లా OG సినిమాపైనే ఎక్కువగా అందరి దృష్టిఉందనేది కాదనలేని వాస్తవం.

గతంలో పవన్ కళ్యాణ్ బాలు, పంజా సినిమాల్లో గ్యాంగ్ స్టర్ కనిపించగా, దాదాపు 12 ఏళ్ల గ్యాప్ తరువాత మళ్ళీ OG సినిమాలో పవన్ కళ్యాణ్  స్టార్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శర వేగంగా జరుగుతుంది.

ఇప్పటికే ముంబై లో రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించి మూడో షెడ్యూల్ ఇటీవలనే హైదరాబాద్ లో మొదలైంది.

- Advertisement -

అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. అదేంటంటే డైరెక్టర్ సుజీత్  OG సినిమాలో పవన్ కళ్యాణ్ కోసం ఒక పవర్ ఫుల్ విలన్ ని సెట్ చేసాడు. అతనెవరో కాదు తమిళ్ యాక్టర్ అర్జున్ దాస్. తమిళ్ లో పవర్ ఫుల్ విలన్ పాత్రలలో కనిపించే ఈ వర్సటైల్ యాక్టర్ ఇటీవలనే తెలుగులో బుట్ట బొమ్మ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. పవర్ ఫుల్ వాయిస్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసే ఈ తమిళ్ నటుడిని OG సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్ర కోసం తీసుకున్నారు. అయితే మరీ అర్జున్ దాస్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అపోజిట్ గా ఉంటాడో, లేదా పవన్ కళ్యాణ్ గ్యాంగ్ లో ఉండే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ప్రస్తుతం అర్జున్ దాస్ OG సినిమాలో నటిస్తున్నాడనే వార్త ఐతే ప్రస్తుతం ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు