#1YearForAnteSundaraniki : ఓల్డ్ వైన్

అంటే సుందరానికి, ఈ సినిమా ఒక ఓల్డ్ వైన్, రోజులు మారే కొద్ది టేస్ట్ పెరుగుతుంది. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడానికి చాలా కారణాలు ఉంటాయి. అలానే ఈ సినిమాకు కూడా ఎదురయ్యాయి. ఈ సినిమా హిట్టా , ప్లాప్ ఆ పక్కన పెడితే ఒక దర్శకుడిగా వివేక్ ఆత్రేయకు , కథానాయకుడిగా నాని కి ఎంత సంతృప్తిని ఇచ్చింది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అలాని ఆడియన్స్ కి నచ్చక్కర్లేదా అంటే అది లేదు, ఇప్పటికి ఈ సినిమాకి చాలా మంది అభిమానులు ఉన్నారు.

అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, జరిగిన తరువాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు అని త్రివిక్రమ్ చెప్పినట్లు. ఈ సినిమా ఒక అద్భుతం కానీ మనం గుర్తించలేదు, అలాని అని ఇప్పుడు గుర్తించాల్సిన అవసరం లేదు. కానీ ఈ సినిమాను ఒక గుర్తుచేసుకోవడంలో తప్పులేదు.
ఇప్పటికి సినిమా రిలీజై ఏడాది అయింది కాబట్టి, కథను కథనాన్ని పూర్తి స్థాయిలో నిస్సంచోకంగా చర్చించవచ్చు.

- Advertisement -

స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్ ప్రసాద్, క్రిస్టియన్ అమ్మాయి అయిన లీలా థామస్ తో ప్రేమలో పడతాడు. రెండు వేర్వేరు మతాలకు చెందిన వీళ్ళ ప్రేమ ఎలా ఫలించింది అనేది కథాంశం. ఈ కథను దాదాపు మూడు గంటల నిడివిలో చెప్పాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. ఇదివరకే ఇలాంటి కథలు “సీతాకోక చిలుక” , “బొంబాయి” , “సప్తపది” , “జూలకటక” వంటి సినిమాలలో మనం ఇదివరకే చేసాం.
కానీ వివేక్ ఈ కథను చెప్పే విధానంలో ఆయా సినిమా తాలూక ఛాయలు ఎక్కడ కనిపించవు.

మామూలుగా తమ ప్రేమను గెలిపించుకోవడానికి యుద్ధాలు, త్యాగాలు , గొడవలు పడటం ఆయా సినిమాలలో మనం చూసాం. కానీ ఈ సినిమాలో తమ ప్రేమను గెలిపించుకోవడానికి సుందర్ ప్రసాద్ చిన్న చిన్న అబద్ధాలు ఆడుతుంటాడు. ఆ చిన్న చిన్న అబద్ధాలు కొన్ని కొన్ని సమస్యలను తీసుకొస్తాయి. సినిమాలో సుందర్ పాత్ర ఆద్యంతం అలరించేలా వివేక్ ఈ సినిమాను డిజైన్ చేసాడు. ముఖ్యంగా ఈ సినిమా లో వివేక్ రైటింగ్ లో ఒక బ్యూటీ ఉంటుంది. వివేక్ సాగర్ మ్యూజిక్ లో ఒక మ్యాజిక్ ఉంటుంది. వివేక్ ఈ సినిమాలో చూపించిన డీటేలింగ్ , డైలాగ్స్ , నాని పెర్ఫామెన్స్ , సుందర్ లీలా మధ్య కెమిస్ట్రీ దేనికవే పోటీ పడుతుంటాయి.

సుందర్, లీలాకి క్రిస్టమస్ కానుకగా ఒక గ్రీటింగ్ కార్డ్ ను ఇస్తాడు.
Basically చిన్న పిల్లలు మనసు చాలా Pure ఉంటుంది. వాళ్లకు కులం,మతం అనే తేడా తెలియదు. అందుకే “అంటే సుందరానికి” సినిమాలో సుందర్ ఆ గ్రీటింగ్ పైన ఓం రాసి ఆ తరువాత మేరీ క్రిస్మస్ అని రాసి లీలా థామస్ కి గ్రీటింగ్ ఇస్తాడు. 90s కిడ్స్ చిన్నప్పుడు ఒక కొత్త పుస్తకం కొనుకున్నా , ఒక పెన్ కొనుకున్న , పరీక్షలు రాసిన దానిపై ఓం రాయడం ఒక అలవాటు అదే సుందర్ ప్రసాద్ కూడా చేసాడు.

సుందర్ ప్రసాద్ అమెరికా ప్రయాణం అయ్యేటప్పుడు సర్దుకునే ట్రాలీ పై
హనుమంతుడు బొమ్మ ఉంటుంది. లంకను చేరడానికి హనుమంతుడు ఎలా సముద్రాలను దాటాడో, అదే విధంగా సుందర్ ప్రసాద్ ఏడు సముద్రాలను దాటి అమెరికా కు చేరాడు అని రిప్రెసెంట్ చేసాడు వివేక్.

లీలా ఇంట్లో తను ప్రెగ్నెంట్ అని చెప్పినపుడు, వాళ్ళ మథర్ టెస్ట్ చేసుకోమంటుంది.అప్పుడు సుందర్ ప్రసాద్ కోక్ మౌంటెన్ డ్యూ ఐడియా ఇస్తాడు. అప్పుడు సుందర్ లీలాతో దీని గురించి నేను చూసాను వర్కౌట్ అవుతుంది అంటాడు. ఈ వీడియోను సుందర్ ఎయిర్ పోర్ట్ కి వెళ్ళే దారిలో కార్ లో చూస్తున్నట్లు వివేక్ చూపిస్తాడు.

#1YearForAnteSundaraniki

బేసిక్ గా ఒక సినిమా స్టార్ట్ అయినప్పుడు ధూమపానం , మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఒక యాడ్ మనం చూస్తాం. కానీ అంటే సుందరానికి సినిమా ముందు ఆ యాడ్ ఉండదు. దానికి కారణం ఒక ఆల్కహాల్ , సిగరెట్ షాట్ కూడా ఈ సినిమాలో ఉండకపోవడం.
ఇలాంటి థింగ్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయ్.

లీలా తీసిన ఫొటోస్ ను ఫ్లెక్స్ హోర్డింగ్స్ పై సుందర్ మదర్ చూస్తున్నప్పుడు, లీలా సుందర్ తో అంటుంది.
మీ మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని,
సుందర్ అంటాడు అంతేమి ఫీల్ అవ్వట్లేదు. మా అమ్మ అలా ఫీల్ అయితే కళ్ళ వెంబడి నీళ్లు అలా కారిపోతాయి అంటాడు.
ఇది సెటప్ చేసి, థామస్ ఫాదర్ సుందర్ ను కొట్టినప్పుడు వాళ్ళ మథర్ ను పేస్ చేస్తాడు సుందర్, అప్పుడు సుందర్ మథర్ కళ్ళవెంబడి నీళ్లు కారిపోతుంటాయి. ఇలా పే ఆఫ్ ఇచ్చాడు వివేక్.

#1YearForAnteSundaraniki

ఎప్పుడూ ప్రసాదం తినని థామస్
మొదటి సారి ఒక బ్రాహ్మణుడు ఇంట్లో పాయసం తింటాడు.
ఎప్పుడూ బొట్టు పెట్టుకోని లీలా థామస్ తల్లి,
బొట్టు పెట్టించుకుంటుంది.
దీనికి కారణం ప్రేమ.
స్వచ్ఛమైన ప్రేమకోసం మన నమ్మకాల్ని ప్రక్కన పెట్టొచ్చు అని నిరూపించిన సినిమా అంటే సుందరానికి,
పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోమని సుందరం చేసినా ఒక
సైగా లీలా థామస్ ని సుందరం కుటుంబానికి దగ్గర చేస్తుంది.

How Beautiful It Is
It’s Just A Vivek Athreya Things ♥️
#1YearForAnteSundaraniki

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు