Citadel: పాస్ట్ బాలేదు… సమంత సరిచేస్తుందా.. బలైపోతుందా ?

కుందనపు బొమ్మ సమంత తెలుగులో స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్, క్రేజ్ ని సొంతం చేసుకుంది. గత కొంత కాలంగా అటు కెరీర్ పరంగా, ఇటు పర్సనల్ లైఫ్ లోనూ  ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమంత తన ఫైటింగ్ స్పిరిట్ తో ఎప్పటికప్పుడు వాటిని అధిగమిస్తూ తన ప్రత్యేకత చాటుకుంటూ వస్తుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత వచ్చిన నెగిటివిటీకి తోడు మయోసైటిస్ సమంత జీవితాన్ని అగాధంలోకి నెట్టేసింది. అయితే, మయోసైటిస్ నుండి త్వరగా కోలుకున్న సమంత వరుసగా సినిమాలు చేస్తూ తన కెరీర్ ని తిరిగి ట్రాక్ లో పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల శాకుంతలం సినిమా ద్వారా డిజాస్టర్ అందుకున్న సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా, వరుణ్ ధావన్ తో సిటాడెల్ ఇండియన్ వర్షన్ లో నటిస్తోంది. ఖుషి సినిమా టర్కీ షెడ్యూల్ ని ముగించుకున్న సమంత ప్రస్తుతం సెర్బియాలో సిటాడెల్ షూటింగ్ లో పాల్గొంటోంది.

ఇదిలా ఉండగా, గత కొంత కాలంగా లేడి ఓరియెంటెడ్ సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్న సమంత తెలుగు కథలు వినడానికి పెద్దగా ఆసక్తి చూపట్లేదని టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు పలువురు నిర్మాతలు స్టార్ హీరోల సినిమాల్లో నటించేందుకు సమంతని సంప్రదించగా ఆ ఆఫర్లను రిజెక్ట్ చేయడమే ఇందుకు నిదర్శనంగా తెలుస్తోంది. ఈ మధ్య రెమ్యునరేషన్ కూడా పెంచిన సమంత ఇకపై పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నట్టు ఫిలిమ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. సమంత పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టడం మంచి పరిణామమే అయినప్పటికీ తెలుగు సినిమాలకు దూరంగా ఉండాలని అనుకోవటం మాత్రం ఒకరకంగా రిస్క్ అనే చెప్పాలి.

గతంలో తాప్సి, ఇలియానా, రకుల్ ప్రీత్ సింగ్ వంటి హీరోయిన్లు టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న సమయంలో బాలీవుడ్ కి మకాం మార్చి అక్కడ ఆశించిన మేర అవకాశాలు అందుకోలేక రెంటికి  చెడ్డ రేవడిలా తయారయ్యారు. అయితే కాజల్ అగర్వాల్, తమన్నా వంటి వారు మాత్రం తిరిగి టాలీవుడ్లో తమ స్థానం సుస్థిరం చేసుకున్నారు. అప్పటికి, ఇప్పటికీ టాలీవుడ్ రేంజ్ లో చాలా తేడా వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోలు నిర్మాతలు టాలీవుడ్ డైరెక్టర్స్, హీరోస్ తో పని చేయటం కోసం ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో టాప్ ప్లేస్ లో ఉన్న సమయంలో బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన భామలు ఏ ఒక్కరు కూడా సక్సెస్ కానీ క్రమంలో సమంత ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందా అన్న ఆసక్తి నెలకొంది. ఏది ఏమైనా సమంత టాలీవుడ్ తో డిస్టెన్స్ మెయింటైన్ చేయటం కలిసొచ్చే అంశంలా అనిపించట్లేదు.

- Advertisement -

ప్రస్తుతం సమంత నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కి సిద్ధం అవుతుండగా ఈ సినిమా మినహా తెలుగు సినిమాలేవీ సమంత లైనప్ లో లేవు. దీన్ని బట్టి చూస్తే, సమంత పాన్ ఇండియా ప్లాన్ నిజమేనేమోనన్న అనుమానం కలుగుతోంది. సిటాడెల్ ద్వారా బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న సమంతకు ఈ సినిమా కెరీర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారనుంది.మరి, వినిపిస్తున్న టాక్ ప్రకారం సమంత టాలీవుడ్ కి గుడ్ బై చెప్పి ముంబై కి మకాం మార్చుతుందా లేదా అన్నది వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు