#VarunLav: ఒక్కసారి కూడా కెమెరా కంటికి చిక్కలేదంటే మాములు విషయం కాదు..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, డింపుల్ క్వీన్ లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యుల మధ్య సింపుల్ గా జరిగిన ఫంక్షన్లో ఉంగరాలు మార్చుకున్న ఈ చూడముచ్చటైన జంట ప్రేమాయణం గురించి ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వరుణ్ తేజ్ లావణ్యలు కలిసి నటించిన మిస్టర్ సినిమా సమయం నుండి రిలేషన్ లో ఉన్నారని లావణ్య త్రిపాఠి ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా కన్ఫార్మ్ అయ్యింది. దీంతో ఇన్నేళ్ళ పాటు కెమెరాలకు దొరకకుండా సీక్రెట్ గా రిలేషన్ మెయింటైన్ చేయటం మాములు విషయం కాదని సోషల్ మీడియాలో  నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

అంతే కాక గతంలో ఓ సినిమా ఫంక్షన్లో లావణ్యకి తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకొమ్మంటూ అల్లు అరవింద్ సలహా ఇస్తున్న వీడియో వైరల్ అయ్యింది.నిజానికి ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియాతో పాటు సోషల్ మీడియా విస్తృతంగా పెరిగిపోయిన ఈ రోజుల్లో సెలెబ్రిటీల పర్సనల్ లైఫ్ లో చీమ చిటుక్కుమన్నా కూడా వైరల్ అవుతున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో వరుణ్ లావణ్య తమ వ్యవహారం బయటపడకుండా నెట్టుకొచ్చారంటే కమిట్మెంట్ కి హ్యాట్సాఫ్ చెప్పచ్చు.

ఈ నేపథ్యంలో మెగా ఇంటికి కోడలు అవుతున్న లావణ్య త్రిపాఠి సినిమాలు కంటిన్యూ చేస్తుందా లేక గుడ్ బై చెబుతుందా అన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం లావణ్య చేతిలో ఒక్క తమిళ సినిమా మినహా వేరే ప్రాజెక్ట్స్ లేవు. దీన్ని బట్టి చూస్తే పెళ్లి తర్వాత లావణ్య సినిమాలకు దూరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.మొత్తానికి మెగా ఇంట పెళ్లి భాజా మోగిన కారణంగా అభిమానుల్లో ఆనందం నెలకొంది. ప్రస్తుతం సరైన హిట్ లేని మెగా ప్రిన్స్ ఎంగేజ్మెంట్ తర్వాత ఆగస్టు 25న రిలీజ్ అవనున్న గాండీవధారి అర్జున సినిమా బ్లాక్ బస్టర్ అందుకుంటాడా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు