Agent: ఏజెంట్ ని మళ్లీ ఎడిట్ చేస్తున్నారా – అసలేం జరుగుతోంది..?

అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో రూపొందిన ఏజెంట్ సినిమా గత నెలలో రిలీజ్ అయ్యి ఎంతటి డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండేళ్లపాటు అఖిల్ సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేసి అఖిల్ పడ్డ కష్టం అంతా వృధా అయ్యింది ఈ సినిమా ద్వారా. ఏజెంట్ ఫెయిల్యూర్ కి కారణం సురేందర్ రెడ్డి అంటూ అభిమానులతో సహా సినిమా యూనిట్ కూడా డిసైడ్ చేసింది. ఇదిలా ఉంటే, ఈ సినిమాను మళ్లీ ఎడిటింగ్ టేబుల్ మీదకి తీసుకెళ్తున్నారని టాక్ వినిపిస్తోంది. సినిమాలోని అనవసరమైన సీన్లని తొలగించి, ఇంకొన్ని సీన్స్ ని యాడ్ చేసి ఓటీటీలో చేయనున్నారని అంటున్నారు. ఎవరు ఎడిట్ చేస్తున్నారు అన్న విషయంపై క్లారిటీ లేదు కానీ ఈ న్యూస్ ఒకింత షాక్ కి గురి చేస్తోంది.

డైరెక్టర్ సురేందర్ రెడ్డి మళ్లీ ఈ సినిమాను టచ్ చేసే సాహసం అయితే చేయడని చెప్పాలి. ఎందుకంటే, అందరూ తననే బాద్యుడ్ని చేయటం, రెమ్యునరేషన్ కూడా సగమే తీసుకోవటం వల్ల ఈ ప్రాజెక్ట్ లో మళ్ళీ జాయిన్ అయ్యే సూచనలు లేవు. నిర్మాత అనిల్ సుంకర గతంలో డైరెక్షన్ చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయనేమైనా ఈ టాస్క్ భుజాన వేసుకున్నారా అన్న అనుమానం కలుగుతోంది. లేకపోతే ఈ సినిమా రైట్స్ కొన్న ఓటీటీ సంస్థ సోని లివ్ ఏమైనా సొంత టీమ్ తో ఎడిట్ చేయించే అవకాశం ఉంది.

మొత్తానికి డిజాస్టర్ అయిన ఏజెంట్ కి మెరుగులు దిద్ది కనీసం ఓటీటీలో అయినా ప్రేక్షకుల మెప్పు పొందాలని సినిమా యూనిట్ చేస్తున్న ప్రయత్నం అయితే మంచిదనే చెప్పాలి. ఎన్నో అంచనాలు పెట్టుకొని ఢీలా పడ్డ అఖిల్ కెరీర్ కి ఈ నిర్ణయం ఒకరకంగా హెల్ప్ అవుతుందనే చెప్పాలి. రిఎడిట్ చేసాక ఓటీటీలో గనక ఏజెంట్ మెప్పిస్తే అఖిల్ పడ్డ కష్టానికి కొంచెమైనా న్యాయం చేసినట్లు అవుతుంది. మరి, ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు