#VarunLav: మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇదే…?

టాలీవుడ్ యాక్టర్లు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఓ ఇంటివారు కాబోతున్నారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందరూ అనుకున్నట్టే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఇక ఈ జంట దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది.

లావణ్య, వరుణ్ ఇద్దరూ కలిసి మిస్టర్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ సినిమా సమయంలోనే ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారని తెలుస్తోంది.లావణ్య త్రిపాఠి కుటుంబ నేపథ్యం గురించి నెట్టింట్లో ఆరా తీస్తున్నారు. డిసెంబర్ 15న 1990లో యూపీలోని ఫైజాబాద్ లో లావణ్య త్రిపాఠి జన్మించింది. ఆ తర్వాత లావణ్య ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో పెరిగింది. ఆమె తండ్రి లాయర్ వృత్తిలో కొనసాగుతున్నారు.

ఆమె తల్లి టీచర్గా పనిచేసి పదవీ విరమణ పొందారు. కాగా, ఆమె అక్క కమిషనర్ గా పనిచేస్తున్నారు. లావణ్య కు ఓ సోదరుడు కూడా ఉన్నారు. డెహ్రాడూన్ లో పాఠశాల విద్య పూర్తి చేసిన లావణ్య ఆ తర్వాత ముంబైకి షిఫ్ట్ అయింది. ఆ తర్వాత మోడలింగ్ పై ఆసక్తితో టీవీ షోలో కనిపించింది. ఆమె పాఠశాలలో చదివే రోజుల్లోనే 2006లో మిస్ ఉత్తరాఖండ్ టైటిల్ గెలుచుకుంది. ఇక 2012లో వచ్చిన అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు