MegaFamily: మెగాబ్రదర్స్ కి చెప్పే ధైర్యం ఎవరికుంది?

When will mega bros remake movies stop?

టాలీవుడ్ లో గత కొంత కాలంగా మెగా ఫ్యామిలీ నుండి రీమేక్ సినిమాలు వస్తున్నాయని తెలిసిందే. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నదమ్ములిద్దరూ ఇద్దరూ రీమేక్ సినిమాలతోనే గత కొంత కాలంగా ఆడియన్స్ ని పలకరిస్తున్నారు. అందులో కొన్ని హిట్ అవగా, మరి కొన్ని దారుణంగా డిజాస్టర్స్ అయ్యాయి. అయితే ఈ రీమేక్ సినిమాల పరంపర ఆపాలని కామన్ ఆడియన్స్ తో పాటు మెగాభిమానులు కూడా కోరుకుంటున్నారు.

20ఏళ్ళ కిందట అంటే ఓటిటిలు, స్మార్ట్ ఫోన్స్ లేవు కాబట్టి రీమేక్స్ చేసినా చూసే వాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. స్ట్రెయిట్ సినిమాలే రొటీన్ గా ఉంటే ఎంత స్టార్ హీరో సినిమా అయినా చూడట్లేదు. అలాంటిది రీమేక్ సినిమాలు ఎవరు పట్టించుకుంటారని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దీనికి ఉదాహరణ, లాస్ట్ ఇయర్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్. సినిమా ఎంత బాగున్నా వీకెండ్ పూర్తయ్యాక ప్రేక్షకులు థియేటర్ కి కన్నెత్తిచూడలేదు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన “బ్రో” కూడా ఒక రీమేక్ గా తెరకెక్కగా ఆ సినిమాకి పవన్ కళ్యాణ్ సినిమాల్లాగా ఓపెనింగ్స్ కూడా రాలేదు. వీకెండ్ తర్వాత బ్రో కూడా డల్ అయింది.

ఇక ఇప్పుడు రాబోతున్న మరో రీమేక్ చిరంజీవి నటించిన “భోళా శంకర్”. వేదాళం అనే రొటీన్ తమిళ్ మసాలా ఫిల్మ్ కి రిమేక్ గా వస్తున్న ఈ మూవీపై మెగా ఫాన్స్ కూడా ఆసక్తిగా లేరు. దానికి ట్రైలర్ ద్వారా వచ్చిన రెస్పాన్స్ తోనే తెలిసిపోయింది. అయితే ఈ రీమేక్లు ఆపేయమని ఇండస్ట్రీలో పెద్దలెవరికి చెప్పే ధైర్యం లేదు. డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు డేట్లు రావడం ముఖ్యం కానీ, వాళ్లు ఎలాంటి సినిమా అనేది పట్టించుకోరు. ఇక అభిమానులా అంటే వాళ్ళు కలవడానికే ఎంతో కష్టపడుతుంది.

- Advertisement -

మరి ఈ అన్నదమ్ములిద్దరికి చెప్పాలంటే ఎవరిద్వారా వీలవుతుందంటే ఇద్దరికి కుదురుతుంది. అది కూడా నామమాత్రమే. ఒకరు మెగా తనయుడు రామ్ చరణ్. ఇంకొకరు అల్లు అరవింద్. రామ్ చరణ్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ లో ఆడియన్స్ ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో గెస్ చేయగలడు కాబట్టి, ఈ జెనరేషన్ కి చెందిన హీరోగా వాళ్లకి చెప్పగలడు. పైగా మెగాబ్రదర్స్ తో ఎక్కువ బాండింగ్ ఫ్యామిలీ లో చరణ్ కే ఉంది.

ఇక అల్లు అరవింద్ చిరంజీవికి, పవన్ కళ్యాణ్ కి స్వయానా బావమరిది. పైగా బిగినింగ్ నుండి వీళ్ళ సినిమాలు దగ్గరుండి మార్కెటింగ్ చేసేవాడు. తెలివైన నిర్మాత. కాబట్టి ఇప్పుడు అల్లు అరవింద్ కూడా చెప్పవచ్చు. అయితే వీళ్ళు చెప్పకపోతే, ప్రేక్షకులు ఇచ్చే రిజల్ట్స్ ద్వారానే మెగా బ్రదర్స్ కి అర్ధమవుతుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు