Chiranjeevi: అప్పుడు క్లిక్ అయినట్టు.. ఇప్పుడు కూడా అవుతుందా?

Bhola Shankar hit sentiment

టాలీవుడ్ లో ఈ ఏడాది పెద్ద హిట్ కొట్టిన స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి. సంక్రాంతికి “వాల్తేరు వీరయ్య” గా వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టడమే గాకుండా 230 కోట్లకి పైగా కలెక్షన్స్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ కింగ్ అనిపించుకున్నాడు. అయితే రిలీజ్ కి ముందు ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. ఈ సినిమా రిలీజ్ కి ముందు విడుదల చేసిన టీజర్, ట్రైలర్ కూడా పెద్దగా హైప్ తీసుకురాకపోగా, రొటీన్ గా ఉన్నాయన్న టాక్ వచ్చింది.

అయితే సినిమా రిలీజ్ మాత్రం టాక్ తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లు వసూలు చేసి సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా స్టోరీ రొటీన్ గా ఉన్నా, స్క్రీన్ ప్లే, కామెడీ ఆకట్టుకోవడంతో మంచి విజయాన్ని నమోదు చేసి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. అయితే ఇప్పడు ఇదే స్ట్రాటజీని “భోళా శంకర్” చిత్ర యూనిట్ కూడా నమ్ముకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా తమిళ హిట్ వేదాళం రీమేక్ గా తెరకెక్కుతున్నప్పటికీ తెలుగులో పలు మార్పులు చేసి తెరకెక్కించడం జరిగింది.

అయితే ఈ సినిమా స్టోరీ కూడా రొటీన్ గానే ఉంటుంది. పైగా భోళా శంకర్ కి సంబంధించిన టీజర్, ట్రైలర్ లు కూడా పెద్దగా మెప్పించలేకపోయాయి. ఇక పాటల నుండి కూడా మిక్సడ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే చిత్ర యూనిట్ మాత్రం సినిమా చాలా బాగుంటుందని, తప్పకుండా నమ్మకంగా ఉంది. వాల్తేరు వీరయ్య కూడా ఇలాగే రొటీన్ సినిమా అనే హైప్ తో వచ్చి బ్లాక్ బస్టర్ అయింది.

- Advertisement -

ఇక పదేళ్ల తర్వాత సినిమా తీస్తున్న మెహర్ రమేష్ సినిమా మేకింగ్ పై చాలా శ్రద్ధ వహించాడని ట్రైలర్ కట్స్ చూస్తే తెలుస్తుంది. అయితే సినిమాని నిలబెట్టేది సెంటిమెంట్స్ కాదు, కంటెంట్ అని తెలిసిందే. మరి “భోళా శంకర్” ఎంత మంది నమ్మకాన్ని నిజం చేస్తాడో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు