Bollywood: రొటీన్ టాక్ తో వీకెండ్ కుమ్మింది. కానీ ఎలా?

“Rocky Aur Rani Prem Ki Kahani” Collections

బాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అయిన క్రేజీ సినిమా “రాకీ ఔర్ రాణి ప్రేమ్ కి కహాని”. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా జులై28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. లవ్& ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రణవీర్ సింగ్, అలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించారు.

ఇక 140కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లను సాధిస్తుంది. అసలేమాత్రం కొత్తదనం లేని సినిమా అని, కరణ్ జోహార్ పాత సినిమాల కథలను మిక్స్ చేసి ఆడియన్స్ పై రుద్దాడని ట్రోల్స్ వస్తున్నప్పటికీ చూసే వాళ్ళు చూస్తున్నారు. ఫస్ట్ డే పెద్దగా ఓపెనింగ్స్ రాకపోయినా, రెండు, మూడు రోజులలో కుమ్మేసింది. “రాకీ ఔర్ రాణి ప్రేమ్ కి కహాని” ఫస్ట్ డే 11కోట్లు, సెకండ్ డే 15 కోట్లు థర్డ్ డే 18కోట్ల తో అదరగొట్టింది. ఇక వర్కింగ్ డే లోను ఈ సినిమా 8 కోట్లకి పైగా నెట్ వసూలు చేయడం విశేషం.

ఇక నాలుగురోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 63కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 60 కోట్లయినా రావాలి. బడ్జెట్ భారీగానే అయినా, నిర్మాత కరణ్ జోహార్ కి డిజిటల్, సాటిలైట్ రైట్స్ లతోనే భారీగా వచ్చేయడం వల్ల ఈ సినిమాకి తక్కువ వసూళ్లు వచ్చినా లాభం పొందుతాడు. అయితే రొటీన్ మసాలా సినిమా అయిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఆడే అవకాశం తక్కువ. మహా అయితే ఇంకో వారం ఆడొచ్చు. ఎందుకంటే ఆగష్టు11 న OMG2, గదర్2 రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ సినిమాని పట్టించుకోరు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు