Raviteja: “టైగర్” అనుకున్న టైం కే వస్తాడట.. మేకర్స్ క్లారిటీ!

Tiger Nageswara Rao Update

టాలీవుడ్ లో ఇప్పుడు అందరు హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీ అవుతున్నారు. సీనియర్ స్టార్ హీరో అయిన మాస్ మహారాజ్ రవితేజ ఇప్పుడు ఒక క్రేజీ పాన్ ఇండియా సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. “టైగర్ నాగేశ్వరరావు” పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు “దోచేయ్” ఫేమ్ వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తుండగా, జి. వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

1970 ల్లో పేరు మోసిన గజదొంగ నాగేశ్వరరావు బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 20న దసరా కానుకగా విడుదల అవుతుందని తెలిసిందే. అయితే గత కొన్నాళ్ల నుండి ఈ సినిమా నుండి ఏ అప్డేట్లు రాకపోవడంతో సినిమా వాయిదా పడిందని, డిసెంబర్ లో లేదా సంక్రాంతికి వస్తుందని రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి. కొందరైతే సినిమా పూర్తిగా ఆగిపోయిందని కూడా అన్నారు. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తూ ఒక నోట్ విడుదల చేసింది.

టైగర్ నాగేశ్వరరావు సినిమా వాయిదా పడలేదని, సినిమా షూటింగ్ యధావిధిగా కంటిన్యూ అవుతుందని, ఎలాంటి రూమర్స్ ప్రేక్షకులు నమ్మకూడదని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. టైగర్ నాగేశ్వరరావు త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని అక్టోబర్20 న ఖచ్చితంగా వస్తాడని మేకర్స్ చెప్పడం జరిగింది. ఈ అనౌన్స్మెంట్ తో మాస్ రాజా ఫ్యాన్స్ హ్యాపీ అయ్యారు.

- Advertisement -

ఇక ఈ సినిమాలో రేణు దేశాయ్ కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అనుపమ్ ఖేర్, జిష్షు సేన్ గుప్త, అలాగే నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే 80శాతం చిత్రీకరణ పూర్తవగా త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనున్నారని సమాచారం.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు