Shanker: ఈ స్పెషల్ డేలో కూడా ఒక్క అప్డేట్ లేదేంటి భయ్యా?

Game changer movie update date?

టాలీవుడ్ లో రాబోతున్న క్రేజీ పాన్ ఇండియా సినిమాల్లో “గేమ్ ఛేంజర్” ఒకటి. RRR తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుండి రాబోతున్న సినిమా కావడంతో కామన్ ఆడియన్స్ లోను మంచి బజ్ ఉంది. అదీగాక ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహించడం వల్ల పాన్ ఇండియా వైడ్ గా మంచి క్రేజ్ తో పాటు భారీ హైప్ ఉంది. అయితే గత రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి ఇప్పటివరకు ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప మరే టీజర్, గాని సాంగ్ గాని రాలేదు.

ఈ విషయంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా రోజులుగా దిల్ రాజుని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయితే సినిమా షూటింగ్ జాప్యం వల్ల ఈ అప్డేట్ లు ఆలస్యం అయ్యాయి అనుకున్నారందరు. రామ్ చరణ్ తన కూతురి బర్త్ వలన కొన్ని రోజులు షూటింగ్ గ్యాప్ ఇవ్వగా, ఆ గ్యాప్ లో శంకర్ ఇండియన్ 2 షూట్ చేసారు. కానీ ఇప్పుడు ఆ హడావిడి అయిపోయి దాదాపు నెలకావస్తుంది. రామ్ చరణ్ పూర్తిగా ఫ్రీ అయిపోయి గేమ్ ఛేంజర్ సెట్స్ లో అడుగుపెట్టాడు.

అయినప్పటికీ ఈ సినిమా నుండి ఏ అప్డేట్ ఫ్యాన్స్ కి రివీల్ చెయ్యట్లేదు. అయితే జులై30 న శంకర్ ఇండస్ట్రీ కి వచ్చి 30 యేళ్ళయిన సందర్భంగా రామ్ చరణ్ స్పెషల్ గా విష్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ డే రోజు గేమ్ ఛేంజర్ నుండి ఏదో ఒక టీజర్ అప్డేట్, లేదా సాంగ్ అప్డేట్, కనీసం మేకింగ్ వీడియో అయినా రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసారు. కానీ అలా జరగలేదు.

- Advertisement -

ఇక అదే రోజు కియారా అద్వానీ బర్త్ డే. అప్పుడైనా కనీసం హీరోయిన్ ఫస్ట్ లుక్ గాని, తన క్యారెక్టర్ గురించి ఏదైనా అప్డేట్ ఇస్తారని అనుకున్నారు. కానీ అదికూడా ఇవ్వలేదు. మరి గేమ్ ఛేంజర్ అప్డేట్ ఎప్పుడిస్తారని సోషల్ మీడియా లో ఫ్యాన్స్ చిత్ర యూనిట్ పేజి లో ట్రోల్ చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు