BRO: ఉస్తాద్ అంటారు? ఓజి అంటారు? మరి “వీరమల్లు” పరిస్థితేంటి?

Will Harihara Veeramallu shoot or not?

టాలీవుడ్ టాప్ హీరోలలో అందరికంటే ఎక్కువ సినిమాలు ఒకేసారి సెట్స్ మీదకి తీసుకొచ్చి, వరుస షెడ్యూల్స్ లో బిజీ గా ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ ఏడాది “బ్రో” సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక పాత్రలో నటించినప్పటికీ ఎక్కువ నిడివి ఉండడంతో ఫ్యాన్స్ ఇది పవన్ కళ్యాణ్ సినిమాగానే భావించారు. ఇక జులై28న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్సడ్ రెస్పాన్స్ ని దక్కించుకుని థియేటర్లలో ఆడుతుంది.

అయితే “బ్రో” తర్వాత ఎన్నికలకు మరో ఆరు నెలలు మాత్రమే సమయం ఉండడంతో ఈ లోపు పవన్ కళ్యాణ్ మరో సినిమా ఖచ్చితంగా పూర్తిచేయాలని చూస్తున్నారు. అయితే కొంతమంది మంది అభిమానులు “ఓజి” సినిమా ముందుగా పూర్తి చేస్తారని, డిసెంబర్ లోపు ఆ సినిమా షూట్ కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తుంది. మరికొందరైతే “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాయే ముందుగా పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చేస్తారని అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాలు మామూలు కమర్షియల్ సినిమాలు కాబట్టి తొందరగా ఫినిష్ చేసే అవకాశం ఉంది.

అయితే ఎప్పుడో నాలుగేళ్ళ కిందట మొదలైన “హరిహర వీరమల్లు” పరిస్థితేంటి? అని కొందరు అభిమానులతో పాటు ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేస్తున్న 4 సినిమాల కంటే ముందుగా స్టార్ట్ అయిన ఈ సినిమా 2022 నుండి వాయిదా పడుతూనే వస్తుంది.పలు కారణాల వలన ఈ సినిమా షూటింగ్ కి గ్యాప్ కూడా వచ్చింది. అయినా కూడా ఇప్పటివరకు వీరమల్లు షూటింగ్ 70 శాతం వరకు కంప్లీట్ అయ్యిందని చిత్ర యూనిట్ నుండి సమాచారం వచ్చింది. మరి ఈ యేడాది స్టార్ట్ చేసిన సినిమా కంటే ఎప్పుడో మూడేళ్లకిందట మొదలుపెట్టిన సినిమా ఫినిష్ చేస్తే మంచిదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

- Advertisement -

పైగా పీరియాడిక్ డ్రామా కాబట్టి పవన్ పొలిటికల్ ప్రచారానికి ముందు ఒక మంచి సినిమా తీసాడన్న పేరొస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా లేట్ చేస్తే సినిమా ఆగిపోయే అవకాశం కూడా ఉందని నెటిజన్లు అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఏ ముందుగా ఫినిష్ చేస్తారో అని ఫ్యాన్స్ తో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొని ఉంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు