Maruthi: డార్లింగ్ ప్రభాస్‌కి ఓ వీక్‌నెస్?

A weakness for darling Prabhas?

బాహుబలితో పాన్ ఇండియా వైడ్ ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్న ప్రభాస్, ఇప్పుడు పాన్ వరల్డ్ రేంజ్‌లో మూవీస్ చేస్తున్నాడు. ఇప్పటికే ఆదిపురుష్ తో ఆడియన్స్ ని పలకరించిన రెబల్ స్టార్ ప్రస్తుతం తాను నటిస్తున్న కల్కి 2898 AD, సలార్, స్పిరిట్ వంటి సినిమాలు సినీ వరల్డ్‌ను ఓ ఊపు ఊపేయడానికి రెడీగా ఉన్నాయి. ఇలాంటి భారీ సినిమాల మధ్య ప్రభాస్ ఓ చిన్న సినిమా చేస్తున్నాడు.

మారుతి డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీకి ఇంకా టైటిల్‌ ఫిక్స్ చేయలేదు. ముందుగా ఈ మూవీకి రాజా డీలక్స్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు న్యూస్ వచ్చింది. ప్రజెంట్ ఈ మూవీకి “రాయల్” అనే టైటిల్ ఫైనల్ చేసినట్టు సమాచారం. అయితే ఈ మూవీలో డార్లింగ్ ప్రభాస్‌కి ఓ వీక్‌నెస్ ఉంటుందట. ఈ వీక్‌నెస్ ఆధారంగానే సినిమా మెయిన్ స్క్రీన్ ప్లే ఉంటుందని టాక్.

సాధారణంగా, సినిమాల్లో హీరోలకు, లేదా హీరోయిన్లకు వీక్‌నెస్ పెట్టడం చాలా కామన్. అలా వీక్‌నెస్ బెస్ చేసకుని వచ్చిన మూవీస్‌కి సక్సెస్ రేటు కూడా ఎక్కువే. ఇప్పుడు డైరెక్టర్ మారుతి కూడా అ… సక్సెస్ మంత్రానే నమ్ముకున్నట్టున్నాడు. ఇంతకు ముందు తన డైరెక్షన్ లో వచ్చిన “భలే భలే మగాడివోయ్”, మహానుభావుడు, బాబు బంగారం లాంటి సినిమాల్లో హీరోలకు ఏదో ఒక లోపం, లేదా వీక్ నెస్ ని చూపించాడు. మరీ డార్లింగ్ ప్రభాస్ ఈ మూవీలో ఎలాంటి వీక్‌నెస్‌ తో కనిపిస్తున్నాడో చూడాలి.

- Advertisement -

అయితే ఈ సినిమా పట్టాలెక్కాలంటే మాత్రం సలార్, కల్కి 2898AD సినిమాల రిలీజ్ తరువాతే సాధ్యమవుతుంది. అంటే మారుతి డైరెక్షన్ లో వచ్చే ప్రభాస్ సినిమా చూడాలంటే 2024 చివర్లో గాని లేదా 2025 సమ్మర్ వరకు టైమ్ పడుతుందన్నమాట.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు