BRO: త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తున్న పీకే ఫ్యాన్స్?

PK fans targeting Trivikram?

టాలీవుడ్ లో ఈ వారం విడుదలైన క్రేజీ సినిమా “బ్రో”. బాక్స్ ఆఫీస్ వద్ద మిక్సడ్ రెస్పాన్స్ ని తెచ్చుకోగా, ఓపెనింగ్స్ పరవాలేదనిపించాయి. అయితే వీకెండ్ తర్వాత వసూళ్లు డల్ అయ్యాయనే చెప్పాలి. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎలాంటి టాక్ వచ్చినా, ఓపెనింగ్స్ భీభత్సంగా వస్తాయి. ఇక పవన్ కళ్యాణ్ గత సినిమాలకి కూడా మంచి వసూళ్లే వచ్చాయి. అయితే “బ్రో” సినిమాకి మాత్రం అంతగా వసూళ్లు రాకపోవడానికి ప్రమోషన్స్ చేయకపోవడం కూడా ఒక కారణం అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఇక “బ్రో” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ కూడా వచ్చాడు. కానీ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాసిన త్రివిక్రమ్ రాకపోవడం పట్ల పీకే ఫ్యాన్స్ లో కొంతమందికి కోపం తెప్పించింది. కనీసం రిలీజ్ తర్వాతైనా ప్రమోట్ చేయడంలేదని ఫ్యాన్స్ త్రివిక్రమ్ మీద గుర్రుమీదున్నారు. అయితే సినిమాకి పని చేయడం ఒకటే కాదు, ఆ సినిమా వచ్చినపుడు దానికి తగ్గ మార్కెటింగ్ కూడా చేయాలనీ ఫ్యాన్స్ అంటున్నారు.

ముందుగా సినిమాకి ఏ హైప్ లేకపోయినా త్రివిక్రమ్ ని నమ్మే చాలా మంది ఫ్యాన్స్ “బ్రో” పై ఆశలు పెట్టుకున్నారు. కానీ సినిమాలో త్రివిక్రమ్ మార్క్ కనిపించలేదని నిరుత్సాహపడ్డారు. అయితే ఇంత జరిగాక సినిమా కలెక్షన్స్ కోసం కనీసం ప్రమోషన్స్ అయినా చేయట్లేదని త్రివిక్రమ్ ని సోషల్ మీడియా లో ట్యాగ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. అయితే మరికొందరు పీకే ఫ్యాన్స్ మాత్రం త్రివిక్రమ్ కి మద్దతుగా నిలబడుతున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు