LEO: “లోకి మల్టీ యూనివర్స్” లో ముందొచ్చేది ఆ సినిమాయేనా?

Lokesh Kanagaraj’s upcoming film is Khaidi 2

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన “లోకేష్ కనగరాజ్” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. “ఖైదీ” సినిమాతో పాపులర్ అయిన ఈ దర్శకుడు ఆ తర్వాత మాస్టర్, విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్స్ తో సౌత్ మొత్తం పాపులర్ అయ్యాడు. అయితే ఈ డైరెక్టర్ కి ఉన్న స్పెషలిటీ ఏంటంటే హాలీవుడ్ సినిమాల్లోలాగా తన సినిమాల కథలన్నిటినీ కలిపేసి మల్టీ యూనివర్స్ సినిమా తీయడం.

కార్తీ ఖైదీ సినిమాను విక్రమ్ సినిమా స్టోరీలో లింక్ చేసిన లోకేష్, ఆ కథకి సూర్య ప్లే చేసిన రోలెక్స్ కథని కూడా లింక్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు రాబోతున్న లియో ని కూడా విక్రమ్ కథకి లింక్ చేస్తున్నట్టు టాక్ నడుస్తుంది. అయితే ఈ కథలకి లింక్ పెట్టాడు గాని, వీటికి సంబంధించిన రెండో పార్ట్ అప్డేట్ మాత్రం ఇప్పటివరకు రాలేదు. లోకి యూనివర్స్ నుండి ఇప్పుడు రావాల్సిన సినిమాలు ఖైదీ2, విక్రమ్2, రోలెక్స్ బ్యాక్ స్టోరీ. ఇన్ని సినిమాల్లో ఏది ముందొస్తుందో చెప్పలేం కానీ, కథ ప్రకారం వస్తే “ఖైదీ2” సినిమాయే ముందుగా రావాల్సి ఉంటుంది.

ఎందుకంటే లోకి యూనివర్స్ లో ఫస్ట్ ఎంటర్ అయిన కథ ఇదే. అంతే కాక ఖైదీ లో హీరో ప్రెసెంట్ స్టోరీ చెప్పారు కానీ, బ్యాక్ స్టోరీ గాని, జైలుకి వెళ్లిన బ్యాక్ స్టోరీ గాని చెప్పలేదు. అందువల్ల ఈ సినిమాయే ముందుగా రావాలని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. పైగా సినిమా వచ్చి కూడా 4యేళ్ల పై బడింది. కాబట్టి ఫ్యాన్స్ ఎక్కువగా ఈ సినిమా గురించే వెయిట్ చేస్తారు.

- Advertisement -

ఇక దీని తర్వాత విక్రమ్ 2 లో ఢిల్లీ ని, విక్రమ్ ని కలిపే అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ ఆ సినిమా రావచ్చు. వీటి తర్వాత సూర్య రోలెక్స్ పాత్ర గురించి సినిమా రావొచ్చు. కాబట్టి ఎలా చూసినా ఖైదీ2 ముందుగా రావాల్సి ఉంటుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు