Senior heroine re-entry: ఏమండోయ్ ఇది విన్నారా.. ఆ స్టార్ హీరో సినిమాలో.. ఆ సీనియర్ నటి రీ-ఎంట్రీ అట

heroine laya re-entry

సీనియర్ నటి లయ మళ్ళీ సినిమాల్లో నటించబోతుందట.. ఒకప్పుడు తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన తెలుగమ్మాయి లయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అయిన సరే ఆమె గుర్తు చేయాలంటే మాత్రం జగపతి బాబు, అర్జున్ నటించిన హనుమాన్ జంక్షన్ సినిమా, భూమిక ప్రధాన పాత్రలో వచ్చిన మిసమ్మ సినిమాల గురించి చెప్పాల్సి వస్తుంది.

ఆమె చివరిగా హీరో శివాజీ నటించిన బ్రహ్మ లోకం టూ యమలోకం సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించింది. ఇక ఆ సినిమా తరువాత వేరే సినిమాలేవీ చేయలేదు. అయితే మళ్ళీ ఇన్నాళ్ళకు ఆమెకు ఒక స్టార్ హీరో సినిమాలో నటించబోతుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హీరోయిన్ లయ సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి, గణేష్ గొర్తి అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని అమెరికా సెటిల్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఆమె సినిమాల్లో నటించక దాదాపు 23 సంవత్సరాలు అవుతుంది. ఇక ఇన్నేళ్ల తరువాత మళ్ళీ ఆమె స్క్రీన్ పై కనిపించబోతుందని తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోలు, హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ పేరుతో మళ్ళీ సినిమాలలోకి ఎంట్రీ ఇస్తున్న వార్తలు వస్తున్న క్రమంలో హీరోయిన్ లయ రీ ఎంట్రీ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇటీవలనే సీనియర్ నటి హీరోయిన్ మీరజాస్మిన్ కూడా విమానం అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించి ప్రేక్షకులకు అలరించిగా, ఇప్పుడు లయ రీ-ఎంట్రీ వార్త ఆసక్తి రేపుతోంది. రామ్ చరణ్ హీరోగా ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విలేజ్ కబడ్డీ బ్యాక్డ్రాప్ ఉండబోతుండగా.. ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ పాత్ర కోసం లయ ను తీసుకోబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయం ఎంతవరకు నిజమో తెలీదు.. ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు