Telugu Actress:బుట్టబొమ్మ చేతిలో ఒక్క సినిమా కూడా లేదా?

Pooja Hegde not getting offers?

టాలీవుడ్ లో ఒకప్పుడు బిజీయెస్ట్ హీరోయిన్ ఎవరు అంటే పూజ హెగ్డే అనే చెప్పాలి. చిన్న సినిమాలతో కెరీర్ మొదలుపెట్టి అరవింద సమెత, అలవైకుంఠపురంబులో, రాధే శ్యామ్ లాంటి పెద్ద సినిమాలు కూడా చేసింది. అయితే గత ఏడాది నుండి ఈ అమ్మడి కెరీర్ ఏమి బాగాలేదు. తెలుగులో ఎన్నో ఆశలు పెట్టుకున్న రాధే శ్యామ్, ఆచార్య సినిమాలు డిజాస్టర్లయ్యాయి. ఒకవైపు తమిళ్ లో విజయ్ తో చేసిన బీస్ట్ కూడా ప్లాప్ అయింది. దాంతో తమిళ్ లో ఆఫర్లొస్తాయనుకుంటే అక్కడ ఫలితం శూన్యమయింది.

ఈ సంవత్సరం ఎన్నో ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ మూవీ “కిసి కా భాయ్ కిసి కా జాన్” డిజాస్టర్ అయింది. అసలు తప్పెక్కడ జరిగిందంటే టాలీవుడ్ లో ప్లాప్స్ వస్తున్నప్పటికీ వస్తున్న కొన్ని ఆఫర్లను కాదని బాలీవుడ్ కి చెక్కేసింది ఈ అమ్మడు. దాంతో తెలుగులో ఆమెకి వచ్చిన ఆఫర్లు అన్ని వేరే హీరోయిన్లు తన్నుకుపోయారు. అదీగాక మొన్న గుంటూరు కారం లో పూజా హెగ్డే ని తీసేసి శ్రీ లీల ని తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా పూజ ని తీసేసి ఆ రోల్ ని వేరే అమ్మాయితో భర్తీ చేద్దామని మేకర్స్ చూస్తున్నట్టు టాక్ నడుస్తుంది.

ఇక అన్ అఫిషియల్ గా పూజ చేతిలో రెండు మూడు ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ అవేమి చెప్పుకోదగ్గవి కాదు. ముఖ్యంగా పెద్ద సినిమాలు ఒక్కటి కూడా లేదని చెప్పాలి. దాంతో ఈ బుట్టబొమ్మ స్పెషల్ సాంగ్స్ అయినా చేయడానికి రెడీ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం. రెండేళ్ల ముందు అరడజను సినిమాలతో రచ్చ చేసిన ఈ బ్యూటీకి ఇప్పుడు ఒక్క పెద్ద సినిమా కూడా చేతిలో లేకపోవడంతో బుట్టబొమ్మ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మరి వచ్చే ఏడాది అయినా బిజీ అవుతుందేమో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు