Sammohanuda: సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న ఆ హీరోయిన్ రొమాంటిక్ సాంగ్!

Sammohanuda song crossed 10 million views

టాలీవుడ్ లో డీజే టిల్లు రాధికా గా ఫేమస్ అయిన నేహా శెట్టి గత సంవత్సరం ఆ ఒక్క చిత్రం తోనే సరిపెట్టుకుంది. కానీ ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీ అయ్యింది. కొంతమంది నెటిజన్లు ఈ భామకి గాలివాటంగా హిట్ వచ్చింది. కాబట్టి ఆఫర్లు రాలేదు అన్నారు. కానీ ఈ ఏడాది మూడు సినిమాలతో ఆడియన్స్ ని పలకరించబోతుంది.

ఇక ఈ ఇయర్ బెదురు లంక, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాల్లో నటిస్తుండగా, ఆల్రెడీ నటించిన “రూల్స్ రంజన్” రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక రూల్స్ రంజన్ నుండి రిలీజ్ అయిన “సమ్మోహనుడా” పాట సోషల్ మీడియా అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది. రొమాంటిక్ సాంగ్ గా రిలీజ్ అయిన ఈ పాటని శ్రేయ ఘోషల్ పాడింది. మెలోడీ ట్యూన్స్ తో శ్రేయ గొంతుతో మంచి రెస్పాన్స్ దక్కించుకుని ఈ పాట ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఇప్పటికే 10మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసిన ఈ పాట మరింత ముందు వెళ్తుంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహా శెట్టి సమ్మొహనుడా పాటలో తన గ్లామర్ తో కుర్రకారుని హీటెక్కించిందని చెప్పాలి. అయితే ఈ సినిమా విజయం నేహా శెట్టితో పాటు అటు హీరో కిరణ్ అబ్బవరం కి కూడా కీలకం అని చెప్పాలి. ఇక రూల్స్ రంజన్ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి తన క్రేజ్ ని రెట్టింపు చేసుకోవాలని చూస్తుంది నేహా శెట్టి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు