latest buzz : లోకేష్- ప్రభాస్ కాంబో కన్ఫామ్ భయ్యా- కావాలంటే చూడు

latest buzz about prabhas lokesh kanakraj movie

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అయితే ఈ వైరల్ న్యూస్ ఎప్పటిలాగా వచ్చే రూమరే అని కొట్టిపడెయ్యడానికి లేదని, తొందర్లోనే నిజం అయ్యేటట్టు ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే లోకేష్- ప్రభాస్ కాంబోపై త్వరలోనే ఒక పెద్ద ప్రొడక్షన్ అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వడానికి రెడీ అయింది. వివరాల్లోకి వెళ్తే

ఇటీవలనే ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ తో సినిమా గురించి లోకేష్ కనకరాజ్ ను ప్రశ్నించగా.. ప్రభాస్ తో సినిమా తప్పకుండ చేస్తానని.. ఆయనతో చేయబోయే సినిమా అటు ఆయన కెరీర్ లో ఇటు ప్రభాస్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమానే చేస్తామని లోకేష్ కనకరాజ్ చెప్పగా ఆ వ్యాఖ్యలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ వ్యాఖ్యలతో ప్రభాస్ లోకేష్ సినిమా కన్ఫామ్ గా ఉండబోతుందని అందరికి క్లారిటీ వచ్చింది.

అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం చూస్తే ఈ కాంబో ను సెట్స్ పైకి తీసుకురావడానికి ప్రముఖ భారీ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ గట్టిగ ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే లోకేష్ కనకరాజ్ ను ఇటీవలనే కలిసిన నవీన్ యెర్నేని, రవి శంకర్ లు ఈ సినిమా గురించి చర్చించుకున్నారట. లోకేష్ కనకరాజ్ కూడా ఈ విషయంపై సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

ప్రస్తుతం ఆయన చేస్తున్న లియో సినిమా షూటింగ్ కూడా ఇటీవలనే కంప్లిట్ అయ్యి, రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక ఆయన నెక్స్ట్ సినిమా రజనీకాంత్ తో చేస్తాడని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్న క్రమంలో.. ఇప్పుడు లేటెస్ట్ గా ప్రభాస్ తో సినిమా చేయబోతున్నాడని తెరపైకి వస్తుంది. మరీ లోకేష్ కనకరాజ్, రజనీకాంత్ తో సినిమా చేస్తాడా, లేక ప్రభాస్ తోనా అనేది మొత్తంగా లోకేష్ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు