Karthikeya: ఈ సినిమాతోనైనా హిట్టు కొడతాడా?

Karthikeya Bedurulanka2012 movie

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్స్ లో ఒకరైన కార్తికేయ ప్రస్తుతం “బెదురులంక 2012” అనే సినిమా చేస్తున్నాడు. క్లాక్స్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రవీంద్ర బెనర్జీ, ముప్పానేని నిర్మిస్తున్నారు. పల్లెటూరులో జరిగే సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్స్ , టీజర్ లు సినిమాపై అంచనాల్ని పెంచేసాయి.

అయితే RX100 తర్వాత మళ్ళీ సరైన హిట్ దక్కలేదు కార్తికేయకి. ఇంతకుముందు వచ్చిన సినిమాలు కూడా మంచి హైప్ తో రిలీజ్ అయ్యి ఏమాత్రం మెప్పించలేకపోయాయి. కొన్ని సినిమాలు కంటెంట్ లేక ఆడకపోతే మరికొన్ని అన్ని అంశాలు ఉన్నప్పటికీ, ప్రమోషన్స్ లేకనో, వేరే సినిమాల పోటీవలనో పెద్దగా ఆడలేవు. అయితే ఈ సారి బెదురు లంక సినిమా కు అలా జరగకుండా జాగ్రత్త పడుతున్నాడు కార్తికేయ. ఫస్ట్ లుక్ రిలీజ్ నుండి ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు.

ఇక రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ డీసెంట్ రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. ట్రైలర్ ని మాత్రం సినిమా రిలీజ్ కి పది రోజుల ముందు మాత్రమే రిలీజ్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే ట్రైలర్ చూసిన తరువాత ఎక్కువ గ్యాప్ వస్తే ఆడియన్స్ కి సినిమాపై ఇంట్రెస్ట్ తగ్గే అవకాశం ఉందని మేకర్స్ అభిప్రాయం కావచ్చు.

- Advertisement -

ఇక మణిశర్మ ఈ సినిమాకి మ్యూజిక్ అందించగా, అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య, LB శ్రీరామ్, గోపరాజు రమణ, రామ్ ప్రసాద్ కీలకపాత్రల్లో నటించారు. ఆగష్టు 25న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా కార్తికేయ హిట్ కొట్టి ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు