Vijay devarakonda-kushi : చిరంజీవిని ఫాలో అవుతున్న విజయ్ దేవరకొండ

vijay devarakonda- kushi

అవునండి ! రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, అచ్చంగా మెగాస్టార్ చిరంజీవిని ఫాలో అవుతున్నాడు. ఉరుకోవయ్యా ఏం మాట్లాడతావ్ మెగాస్టార్ చిరంజీవిని విజయ్ దేవరకొండ ఫాలో అవడమేంటి అర్థంలేని ప్రేలాపన అనుకుంటున్నారా అయితే మీకు అసలు మ్యాటర్ చెప్పాల్సిందే.

ఈ మధ్య టాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన చిరులీక్స్ గురించి అందరికి తెలిసిందే. అఫీషియల్ గా ఎనౌన్స్ చేయడానికి ముందే చిరు తన సినిమాల గురించి అప్డేట్స్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకోవడంతో ఫ్యాన్స్ అంత చిరంజీవి ఇచ్చే అప్డేట్స్ ను ముద్దుగా చిరులీక్స్ అని పిలుచుకుంటున్నారు.

అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఇలాంటి పనే ఒకటి చేయడంతో ఫ్యాన్స్ అంత మార్కెట్లోకి మరో చిరు వచ్చాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే చిరులీక్స్ లో చిరంజీవి నాన్చకుండా విషయం సూటిగా ఫ్యాన్స్ తో షేర్ చేస్తాడు.. కానీ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మాత్రం కాస్త కొత్తగా తెలిసి, తెలియనట్టుగా ఫ్యాన్స్ తో ఆయన లేటెస్ట్ ఖుషి సినిమా అప్డేట్స్ ను ఫ్యాన్స్ తో పంచుకున్నాడు.

- Advertisement -

నిన్నుకోరి మూవీ ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , సమంత కలిసి నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఖుషి గురించి అందరికి తెలిసిందే. మైత్రి మూవీస్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే రిలీజైన పాటలు ఈ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. కాగా ఈ సినిమా రిలీజ్ కు కరెక్ట్ గా నెల రోజులు ఉండటంతో ఇక నుంచి సినిమా రెగ్యులర్ అప్డేట్స్ ఏ ఏ రోజు ఇవ్వబోతున్నారనే విషయంపై అఫీషియల్ కంటే ముందే విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో పోస్ట్ చేసేసాడు. “8 days.14 days.30 days.#Kushi” అని విజయ్ పోస్ట్ చేయడంతో

8 రోజుల్లో ఖుషి ట్రైలర్, 14 రోజుల్లో మ్యూజికల్ ఈవెంట్, 30 రోజుల్లో సినిమా రిలీజ్ అంటూ ఫ్యాన్స్ ఆ ట్విట్ లో ఉన్న విషయాన్ని బ్రేక్ డౌన్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్స్ వేస్తూ హల్చల్ చేస్తున్నారు. ఇక మరి కొందరు మాత్రం చిరంజీవి లాగే విజయ్ కూడా లీక్స్ ట్రెండ్ లో జాయిన్ అయ్యాడంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు