Gunturukaram: దీనికే ఇలా చేస్తే ఎలా? ఆ డైరెక్టర్ తో చేయగలడా? ఓపిక ఉందా?

Mahesh Babu Rajamouli movie

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన మహేష్ బాబు వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. భరత్ అనే నేను తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్లు కొడుతూ టాప్ రేంజ్ లో కొనసాగుతున్నాడు సూపర్ స్టార్. అయితే ఇప్పుడు ఆ స్పీడ్ మాత్రం కనిపించట్లేదు. చీటికి మాటికీ ఫారెన్ వెకేషన్లకి వెళ్తూ, సినిమాపై ఫోకస్ పెట్టడం లేదని కొందరంటున్నారు.

అసలు విషయానికొస్తే మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో “గుంటూరు కారం” చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ లో జాప్యం వస్తుంది. కొన్ని రోజుల కిందట హీరోయిన్ ని చేంజ్ చేయగా, మొన్నటికి మొన్న మ్యూజిక్ డైరెక్టర్ ని కూడా మార్చే ప్రయత్నంలో ఉన్నారని టాక్ వచ్చింది. ఈ గ్యాప్ లో మహేష్ మూడు నాలుగు సార్లు ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లి వచ్చారు.

అయితే మహేష్ ఫ్యాన్స్ మాత్రం సినిమా ఫినిష్ అయ్యి సంక్రాంతికి వస్తుందా రాదా అన్న కంఫ్యూషన్ లో పడ్డారు. ఇక విమర్శకులైతే త్రివిక్రమ్ తో చేస్తున్న ఒక మామూలు కమర్షియల్ సినిమాకే ఇలా గ్యాప్ ఇస్తూ ఉంటే, ఆ తరువాత దర్శకధీరుడు రాజమౌళితో సినిమా ఎలా చేయగలడని నెటిజన్లు అంటున్నారు.

- Advertisement -

ఎంత మహేష్ బాబు అయినా రాజమౌళి తో సినిమా తీయాలంటే కనీసం రెండు, మూడేళ్లు డేట్స్ కేటాయించాల్సి ఉంటుంది. అది కూడా గ్యారెంటీ గా టైం కి వస్తుందని చెప్పలేము. మరి త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాకి స్క్రిప్ట్ వర్క్ లో జరుగుతున్న లొసుగులని పరిష్కరించకుండా, ఫ్యామిలీ ట్రిప్ లకి వెళ్లడం కరెక్ట్ కాదని కొందరు నెటిజన్ల అభిప్రాయం. ఇలా రాజమౌళి సినిమాకైతే చేయడం కుదరదు.

మరి బాబుగారు ఎంత తొందరగా త్రివిక్రమ్ తో సినిమా ఫినిష్ చేస్తే అంత బాగుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక గుంటూరు కారం సినిమా అయితే దాదాపుగా సమ్మర్ కి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు