Maheshbabu: “గుంటూరు కారం” గురించి ఆరోజు క్లారిటీ ఇస్తారా?

Guntur Karam release date update?

టాలీవుడ్ లో క్రేజీ బజ్ ఉన్న సినిమాల్లో “గుంటూరు కారం” ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై ఆడియన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీనికితోడు రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కూడా ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రోజులే “గుంటూరు కారం” 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నామని ప్రకటించిన మేకర్స్ ఇప్పుడు కన్ఫ్యూషన్ లో పడ్డారు.

ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఎదో ఒక రకంగా షూటింగ్ కి పలుమార్లు బ్రేక్ పడుతూ వచ్చింది. ముందుగా మహేష్ బాబు ఫ్యామిలిలో తన తల్లిదండ్రుల మరణం గుంటూరు కారం సినిమాకి బ్రేక్ పడేలా చేసింది. ఆ తరువాత సినిమాలో బ్యాక్ అప్ కోసం మహేష్ బాబు విదేశాలకు వెళ్లారు. ఇక ఇక్కడ తాను లేకుండా కొన్ని సీన్లు త్రివిక్రమ్ షూట్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఈ సినిమాలో పూజ హెగ్డే పాత్ర అంతగా సెట్ కాకపోవడం వల్ల ఆమెని తీసేసి, సెకండ్ హీరోయిన్ గా చేస్తున్న శ్రీ లీలని మెయిన్ హీరోయిన్ గా మార్చడం వల్ల స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేయాల్సి వచ్చింది.

సినిమా స్క్రిప్ట్ లో చేసిన చేంజెస్ మహేష్ కి నచ్చలేదని అందువల్ల ఇంకా మార్పులు చేసిన తర్వాతే షూటింగ్ స్టార్ట్ చేద్దామని మహేష్ చెప్పినట్టు మూవీ టీమ్ నుండి సమాచారం వచ్చింది. ఈ గ్యాప్ లో మహేష్ మరోసారి ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇవన్నీ గాక మ్యూజిక్ డైరెక్టర్ విషయంలోనూ డైరెక్టర్ అసంతృప్తిగా ఉన్నారని, థమన్ ని తీసేసి వేరొకరిని భర్తీ చేసే ఆలోచనలో ఉన్నారని చాలా రోజులుగా వార్తలు వినబడుతున్నాయి. మరి దీని విషయంలో చిత్ర యూనిట్ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు.

- Advertisement -

అయితే ఇన్నిరకాల సమస్యల “గుంటూరు కారం” అసలు సంక్రాంతికి వస్తుందా లేదా? అన్న సందిగ్ధత లో పడ్డారు మహేష్ ఫ్యాన్స్. అయితే దీనికి ఆగష్టు9 న క్లారిటీ వస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే ఆ రోజు మహేష్ బాబు బర్త్ డే. కాబట్టి గుంటూరు కారం మూవీ గురించి ఎదో ఒక అప్డేట్ ఇస్తారు. అందువల్ల ఆ రోజు సినిమా రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇస్తారని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గుంటూరు కారం సినిమాని దాదాపు పోస్ట్ పోన్ చేసే అవకాశం లేదని అనిపిస్తుంది. ఎందుకంటే సంక్రాంతికి ఇంకా 5నెలల సమయం ఉంది. కాబట్టి ఈలోపు సినిమా షూట్ చేసేయొచ్చని నెటిజన్లు అంటున్నారు. ఏది ఏమైనా దీనిపై క్లారిటీ రావాలంటే ఆగష్టు9 వరకు వెయిట్ చేయక తప్పదు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు