First look from Chandramukhi-2 : వేంకటపతి రాజా శేఖరుడు వచ్చేసాడు

First look from Chandramukhi-2

రాఘవ లారెన్స్, బాలీవుడ్ యాక్ట్రెస్ కంగనా రనౌత్ హీరో హీరోయిన్స్ రాబోతున్న లేటెస్ట్ సినిమా చంద్రముఖి2 లోని పవర్ ఫుల్ లుక్ పోస్టర్ విడుదల చేసింది మూవీ టీం. 2005 లో రజనీకాంత్, నయనతార, జ్యోతిక ప్రధాన పాత్రలలో వచ్చిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు శర వేగంగా జరుపుకుంటుంది.

వచ్చే వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. చంద్రముఖి సినిమాలో బాగా పాపులర్ అయిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గురించి అందరికి తెలిసిందే. చంద్రముఖి సినిమా అంత ఒక ఎత్తు అయితే, ఆ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ మరో ఎత్తు. అతి తక్కువ నిడివి కలిగిన వేంకటపతి రాజా ఫ్లాష్ బ్యాక్ సినిమాకే పెద్ద హైలెట్ అని చెప్పవచ్చు. అయితే అలాంటి పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను ఇప్పుడు రాబోతున్న చంద్రముఖి2 లో కూడా పెట్టినట్టు తెలుస్తుంది.

సౌత్ ఇండియన్ భాషల్లో అన్నింటిలోను పాపులర్ అయ్యి ప్రేక్షకాదరణ పొందిన చంద్రముఖి సినిమా పార్ట్ 2 పై ఆడియన్స్ లో భారీ అంచనాలున్నాయి. దానికి తోడు ఈ సినిమాని ఇప్పుడు పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. పార్ట్ 1 రూపొందించిన దర్శకుడు పి వాసు నే ఈ సినిమాని కూడా తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వినాయక చవితికి రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా, చంద్రముఖి పార్ట్ 1 సక్సెస్ ను బాలన్స్ చేస్తుందో లేదో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు