Shah Rukh Khan jawan latest update : ” దుమ్ము దులిపేలా” జవాన్ ?

Shah Rukh Khan jawan latest update

రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వస్తోన్న జవాన్ పాటల సందడి ఈ రోజు నుంచే మొదలవబోతుంది. ఇటీవలనే రిలీజ్ చేసిన జవాన్ టీజర్ ప్రేక్షకులను విపరితంగా ఆకట్టుకోగా, లేటెస్ట్ గా ఇప్పుడు జవాన్ మూవీ పాటలతోను ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది.

షారుఖ్‌ ఖాన్, నయనతార, హీరో హీరోయిన్స్ గా విజయ్‌ సేతుపతి, ప్రియమణి ప్రధాన పాత్రల్లో రాబోతున్న జవాన్ సినిమా. భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. పేట్రియాటిక్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇటీవలనే పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న షారుఖ్ ఖాన్, జవాన్ తో ఆ సక్సెస్ ను కంటిన్యూ చేస్తూ, బాలీవుడ్ లో తన సత్తాను మరోసారి ప్రూవ్ చేసుకోడానికి రెడీ అయ్యాడు. వచ్చే సెప్టెంబర్ 7 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాలోని మొదటి పాటను ఈరోజు మధ్యాహ్నం 12:50 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్టు కాసేపటి క్రితం సోషల్ మీడియా ద్వారా మూవీ టీం ప్రకటించింది.

సౌండ్ అఫ్ జవాన్ పేరుతో రిలీజవబోతున్న ఈ సాంగ్ తెలుగులో “దుమ్మే దులిపేలా” అనే మాస్ బిట్ తో ఉండబోతున్నట్టు తెలిపారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే జైలర్ సినిమా పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అనిరుధ్ మరోసారి జవాన్ సాంగ్స్ తో దుమ్ము దూలపడానికి రెడీ అయ్యాడు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు