TEASER TALK : తేడా చేస్తే నరాలు లాగేస్తా- విశ్వక్ సేన్

TEASER TALK gangs of godavari

“అన్న మేము గోదారోళ్ళం మాటా ఒక్కటే సాగదీస్తాం.. తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం ” అని వార్నింగ్ ఇస్తున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. అయితే విశ్వక్ సేన్ ఇచ్చిన ఈ వార్నింగ్ ఏ సినిమా ఫంక్షన్ స్టేజ్ పైనో ఇచ్చింది కాదు ఆయన లేటెస్ట్ సినిమా టీజర్ లో ఇచ్చింది.

విశ్వక్ సేన్ హీరోగా, చల్ మోహన్ రంగ సినిమా ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ సినిమా గ్యాంగ్స్ అఫ్ గోదావరి టీజర్ కాసేపటి క్రితమే రిలీజయింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా ఒక సీరియస్ కథాంశంతో రాబోతున్నట్టు టీజర్ ద్వారా తెలుస్తోంది. గోదావరి జిల్లాలో చేపలు పట్టుకునే మత్స్య కారుడి రోల్ లో విశ్వక్ సేన్ మేక్ ఓవర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మంచి ప్రొడక్షన్స్ వ్యాల్యూస్ తో సినిమాని రూపొందించినట్టు విజువల్స్ ద్వారా స్పష్టమవుతోంది.

ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన టిల్లు బ్యూటీ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, హీరోయిన్ అంజలి కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించబోతుంది. రాజకీయ అంశాలు ప్రధానంగా ఉండబోతున్న ఈ సినిమాలో సాయి కుమార్, నాజర్, కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. హ్యారిస్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఈ డిసెంబర్ లో విడుదల సిద్ధమవుతోంది.

- Advertisement -

ఇప్పటికే నాని 30వ చిత్రం హాయ్ నాన్న, వెంకటేష్ సైంధవ్, నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు క్రిస్మస్ రేస్ లో ఉండగా విశ్వక్ కూడా ఈ రేస్ లోనే జాయిన్ అయ్యాడు. కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ ను మాత్రం టీజర్ లో ఎక్కడ కన్ఫామ్ చేయకుండా హోల్డ్ చేసింది మూవీ టీం. ఆయా సినిమాల రెస్పాన్స్ ను బట్టి డేట్ ఫిక్స్ చేయడం వాళ్ళ ఉదేశ్యం కాబోలు.

ఇక ఇటీవలనే దాస్ కా ధమ్కీ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న విశ్వక్ సేన్ గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాతో మరో సక్సెస్ కొడతాడో లేదో చూడాలంటే డిసెంబర్ వరకు ఆగాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు