PSPK: వీకెండ్ కుమ్మింది బ్రో.. మరి ఇప్పుడు?

“BRO” Weekend Collections:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “బ్రో” బాక్స్ ఆఫీస్ వద్ద కుమ్ముతుంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో అన్నిటికంటే తక్కువ అంచనాలతో రిలీజ్ అయినప్పటికీ, ఫ్యాన్ బేస్ బలంతో భారీ ఓపెనింగ్స్ ని కొల్లగొట్టింది “బ్రో”. ఇక సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో మెయిన్ హీరో అయినప్పటికీ పీకే ఫ్యాన్స్ తమ హీరో సినిమాగానే భావించారు. అదే ఈ సినిమాకి ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ రావడానికి కారణం అయింది.

ఇక ఫస్ట్ డే లిమిటెడ్ స్క్రీన్స్ లో రిలీజ్ అయినా వరల్డ్ వైడ్ గా క్రేజీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల్లో అన్ని ఎలెమెంట్స్ ఈ సినిమాలో ఉండేసరికి ఫ్యాన్స్ కి మంచి బూస్ట్ ఇచ్చినట్టయింది. మొదటిరోజు పవన్ గత సినిమాతో పోల్చితే ఓపెనింగ్స్ కొంచెం తక్కువగానే వచ్చినా ఓవరాల్ గా ఊహించినదానికంటే ఎక్కువే వచ్చాయి.

- Advertisement -

ఫస్ట్ డే 30కోట్ల వరకు షేర్ రాబట్టిన బ్రో వీకెండ్ ముగిసేసరికి సూపర్ కలెక్షన్లు సాధించింది. కొంత వరకు వర్షాల ఎఫెక్ట్ ప్రభావం చూపించినా ఓవరాల్ గా కుమ్మింది. ఏరియా వైస్ గా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో 44.56 కోట్లు, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా లో 4.85కోట్లు, ఓవర్సీస్ లో 5.85 కోట్లు ఇక మొత్తంగా మూడు రోజుల్లో 55.26 కోట్ల షేర్ ని, 91.75 కోట్ల గ్రాస్ ని రాబట్టింది.

అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా చాలా దూరం వెళ్ళాలి. 98 కోట్ల టార్గెట్ లో వచ్చిన మొత్తం తీసేస్తే ఇంకా 43 కోట్లయినా కావాలి. అయితే వీకెండ్ సెలవుల్లో బాగానే రాబట్టిన బ్రో కి వర్కింగ్ డే లోనే అసలు పరీక్ష ఎదురుకానుంది. మొదటివారంలో కనీసం మరో 30కోట్లయినా రికవరీ చేస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని లాంగ్ రన్ లో రీచ్ అయ్యే అవకాశం ఉంది. మరి చూడాలి ఏమవుద్దో.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు