DoubleISMART Latest update: డబుల్ ఇస్మార్ట్ ,ట్రిపుల్ స్పీడ్- పూరి మామూలోడు కాదు భయ్యా

DoubleISMART Latest update

సినిమాలు తీయడం మాత్రమే ఆయనకు తెలిసింది. సినిమా హిట్, ఫ్లాప్ లను కేర్ చేయడం ఆయన డిక్షనరీలోనే లేదు. హిట్ వస్తే పొంగిపోవడం, ఫ్లాప్ కు కుంగిపోవడం లాంటివి ఆయన చేయడు. పై లైన్ చదవగానే ఎవరికీ గురించి చెబుతున్నామో,  ఆయనెవరో మీకు అర్ధమయ్యే ఉంటుంది ఆయన మరెవరో కాదు పూరి జగన్నాథ్ అని.

పూరి జగన్నాథ్ సినిమా స్క్రిప్ట్ ఎంత వేగంగా రాస్తాడో, షూటింగ్ ఎంత త్వరగా చేస్తాడో అందరికి తెలిసిందే. కానీ పూరి ఆయన గత చిత్రమైన లైగర్ సినిమాకు మాత్రం దాదాపు వన్ ఇయర్ టైం తీసుకొని సినిమా కంప్లిట్ చేసాడు. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. లైగర్ సినిమా ద్వారా పూరి, సినిమాను ఎక్కువ రోజులు నాన్చడం మంచిది కాదని రియలైజ్ అయినట్టు ఉన్నాడు. ప్రస్తుతం ఆయన రామ్ పోతినేని తో చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాను ట్రిఫుల్ స్పీడ్ తో కంప్లిట్ చేస్తున్నాడు.

ఇటీవలనే డబుల్ ఇస్మార్ట్ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసిన పూరి జగన్నాథ్ అప్పుడే మొదటి షెడ్యూల్ కూడా కంప్లిట్ చేసాడు. ఫస్ట్ షెడ్యూల్ లో భాగంగా సంజయ్ దత్, రామ్ పోతినేని కి మధ్య భారీ యాక్షన్స్ సీక్వెన్స్ ను షూట్ చేయాల్సి ఉండగా, షూటింగ్ మొదలు పెట్టిన వారం రోజుల్లోనే విజయవంతంగా ఈ యాక్షన్స్ సీన్స్ పూరి కంప్లిట్ చేసినట్టు మూవీ టీం ప్రకటించింది. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై హీరోయిన్ ఛార్మి, పూరి జగన్నాథ్ కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది శివరాత్రి కానుకగా మార్చ్ 8న రిలీజ్ చేయబోతున్నట్టు  ప్రకటించగా, పూరి జగన్నాథ్ స్పీడ్ చూస్తుంటే అనుకున్నదానికంటే ముందే డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ ఫినిష్ చేసేలాగా ఉన్నాడు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు