Anil Ravipudi: బాలయ్య మార్క్ లో.. భారీ యాక్షన్ సీన్స్

Huge action scenes in Balayya Mark.

టాలీవుడ్ లో సీనియర్ హీరోల్లో ఇప్పుడు అందరికంటే ఎక్కువ బిజీ గా, ఫుల్ జోష్ లో బాలకృష్ణ ఉన్నారు. మూడేళ్ళ కిందటి వరకు బాలయ్య వేరు ఇప్పుడు బాలయ్య వేరు. అఖండ సినిమా బ్లాక్ బస్టర్ తో స్వింగ్ లో కొచ్చిన ఈ నందమూరి నట సింహం సంక్రాంతికి వీరసింహ రెడ్డిగా వచ్చి మరో సూపర్ హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడితో భగవంత్ కేసరి చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తవగానే బాబీ డైరెక్షన్ లో తన 109వ సినిమా చేస్తున్నాడు.

ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడితో చేస్తున్న భగవంత్ కేసరి షూటింగ్ ముగింపు దశకు చేరుకుంటుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ఫ్యాన్స్ కి సూపర్ గా నచ్చేసింది. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం రామోజీ ఫిలిం సిటీ లో వేసిన సెట్ లో ఒక భారీ యాక్షన్ సీన్ ని చిత్రీకరిస్తున్నట్టు తెలిసింది. ఈ యాక్షన్ సీక్వెన్స్ బాలయ్య గత చిత్రాల్లో మాదిరిగా, అంత కంటే స్పెషల్ గా ఆయన మార్క్ లో ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపారు.

ఇక ఈ ఫైట్ సీన్ పూర్తయితే సినిమా షూటింగ్ 85 శాతం కంప్లీట్ అయినట్టే అని టాక్. ఇక “భగవంత్ కేసరి” తో హ్యాట్రిక్ హిట్ కొట్టి చాలా ఏళ్ళ తరువాత తన సత్తా చూపాలనుకుంటున్నాడు బాలకృష్ణ. ఇక భగవంత్ కేసరి రిలీజ్ కావడానికి మూడు నెలల సమయం ఉన్నా, తొందరగా ఫినిష్ చేసి బాబీ తో షూటింగ్ చేయాలనీ చూస్తున్నాడు బాలయ్య. ఎందుకంటే సంవత్సరం చివర్లో టీడీపీ ఎన్నికల ప్రచారం ఉన్నందువల్ల అక్కడ పాల్గొనే అవకాశం ఉంది. అందుకే బాబీ కూడా తన పనుల్లో తాను ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు