Kotabommali PS title issue : ఆ సూపర్ హిట్ సినిమాకు రీమేక్ కు ఇదేం టైటిల్ భయ్యా

Kotabommali PS title issue

ఒక సినిమా జనాల్లోకి ఈజీగా వెళ్ళడానికి సినిమా టైటిల్ అనేది చాలా ప్రాధాన్యత వహిస్తుందనే విషయం అందరికి తెలిసిందే. టైటిల్ ఎంత క్యాచీగా, ప్రేక్షకులకు అర్ధమయ్యే విధంగా ఉంటే అంత ఎక్కువగా సినిమా పాపులర్ అవుతుంది. అలాగని కంటెంట్ తో సంబంధం లేకుండా ఏదీ పడితే అది టైటిల్ గా పెట్టిన కూడా తరువాత వచ్చే కొన్ని పరిణామాలు ఎదుర్కోక తప్పదు.

అయితే ఈ టైటిల్ వ్యవహారం గురించి ఎందుకు మాట్లాడుకోవలసి వచ్చిందంటే.. మలయాళంలో సూపర్ హిట్టైన నయట్టు అనే సినిమాను ప్రస్తుతం తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సీనియర్ నటుడు శ్రీకాంత్ , రాహుల్ విజయ్ మరియు శివానీ రాజశేఖర్‌ లు ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు కోట బొమ్మాలి పీఎస్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు, తేలియాజేస్తూ కాసేపటి క్రితమే సినిమా పోస్టర్ ను రిలీజ్ చేసారు. అయితే ఈ పోస్టర్ చూడటానికి ఇంట్రెస్టింగ్ గానే ఉన్న కూడా, సినిమా టైటిల్ విషయంలో మాత్రం కొంతమంది ప్రేక్షకుల నుంచి విమర్శలు వస్తున్నాయి.

నిజానికి నయట్టు సినిమా ఒక సస్పెన్స్ పొలిటికల్ థ్రిల్లర్. ఒక ముగ్గరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్ ఒక పొలిటికల్ ఇష్యూ లో చిక్కుకొని ఎలాంటి ఇబ్బందులు పేస్ చేశారనేది కథ. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటుంది. అయితే అలాంటి ఒక సీరియస్ సినిమాను రీమేక్ చేస్తూ ఎదో హర్రర్ సినిమాను తలపిస్తునట్టు కోట బొమ్మాలి పీఎస్ అనే టైటిల్ పెట్టడం ఏంటని కొంతమంది విమర్శిస్తున్నారు.

- Advertisement -

జోహార్ సినిమా ఫేం తేజ మార్ని దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను జిఏ2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. గతంలో నయట్టు సినిమా రీమేక్ ను రావు రమేష్ తో చేద్దామనుకోగా అది వర్క్ అవుట్ అవ్వలేదు. ఆ తరువాత చాలా మంది దగ్గరికి తిరిగిన ఈ స్క్రిప్ట్ ఫైనల్ గా హీరో శ్రీకాంత్ దగ్గరికి వచ్చి ఆగడంతో ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. అయితే సినిమాలో కంటెంట్ పరంగా ఎలాంటి డౌట్ లేకపోయిన టైటిల్ మాత్రం హర్రర్ సినిమాను తలపిస్తుండటంతో ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుందని అంత మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ మొత్తం విషయంలో అసలు ట్విస్ట్ ఏంటంటే నయట్టు సినిమా రీమేక్ బన్నీ వాసు చేస్తున్నాడని అందరికి తెలిసిన, అయితే ఆ సినిమా ఈ సినిమానేనా కదా అనేది ప్రశ్నార్ధకంగా ఉంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు