BABY: బాస్ ఏంటి? ఏకంగా సహజనటితో పోల్చేసారు

Megastar Chiranjeevi compared Vaishnavi to Jayasudha

టాలీవుడ్ లో రెండు వారాల కిందట రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన సినిమా “బేబీ”. ఈ మధ్య రిలీజ్ అయిన చిన్న సినిమాల్లో ఎక్కువ హైప్ తో విడుదలైన సినిమా ఇది. ఇక ఈ సినిమాకి రిలీజ్ రోజు నుండి మిక్సడ్ రెస్పాన్స్ వస్తున్నప్పటికీ టాక్ తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లు సాధించింది. ఇక ఈ సినిమాలో టైటిల్ రోల్ లో వైష్ణవి చైతన్య నటించగా, హీరోలుగా ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ లు నటించారు.

జులై14 న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించడంలో చిత్ర యూనిట్ బాగా కష్ట పడింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ఈవెంట్ కి ఇంతకు ముందు ఆల్రెడీ అల్లు అర్జున్ వచ్చి విష్ చేయగా, తాజాగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా మరో ఈవెంట్ ని జరపడం జరిగింది. ఇక ఆ ఈవెంట్ చిరంజీవి రావడం, ఎప్పట్లాగే చిత్ర యూనిట్ ని తన మార్క్ లో ప్రశంసించడం జరిగింది.

అయితే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ వైష్ణవి నటనని ప్రశంసిస్తూ ఏకంగా సహజనటి జయసుధ తో పోల్చారు మెగాస్టార్. తెలుగు సినిమాల్లో సహజంగా నటించే అలనాటి నటీమణుల్లో జయసుధది ప్రత్యేక శైలి. ఆమె నటించిన ఏ సినిమాలో అయినా హీరోతో సమానంగా ఇంపార్టెన్స్ ఉండేది. ఇక సహజంగా నటించే ఆవిడకు సహజనటి అని ఇండస్ట్రీ లో అందరు అంటారు. అలాంటి నటితో వైష్ణవి ని పోల్చడం పట్ల అందరు ప్రశంసిస్తున్నా, కొందరు విమర్శకులు మాత్రం సరికాదంటున్నారు.

- Advertisement -

యూట్యూబ్ ద్వారా పాపులర్ అయి మంచి నటిగా పేరు తెచ్చుకొవడానికి వైష్ణవి చాలా కష్ట పడింది. బేబీ సినిమాలో వైష్ణవి పాత్రే హైలెట్ గా నిలిచింది. అలాగని ఏకంగా సహజనటితో పోల్చడం సరికాదని అంటున్నారు విమర్శకులు. ఎందుకంటే ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో సాయి పల్లవి, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లు ఎంతో మంది సహజంగా నటించే తత్వం ఉన్నవాళ్లు. వీళ్ళని కాదని ఒక్క సినిమా అనుభవంతో ఏకంగా సహజనటితో హీరోయిన్ ని పోల్చడం కరెక్ట్ కాదని అంటున్నారు.

అయితే ఈ కాంప్లిమెంట్ చిత్ర నటిని ప్రశంసించేందుకు మాత్రమే అన్నట్టు మెగాస్టార్ మాటల్లో తెలుస్తుంది. ఆవిడతో పోల్చినంత మాత్రాన అంతటి పేరు వచ్చేయదు కాదా! ఇంకా ముందు ముందు చాలా సినిమాలు చేయాలి. అయితే ఈ కాంప్లిమెంట్ తో హీరోయిన్ వైష్ణవి మాత్రం ఫుల్ హ్యాపీ గా ఉందని చెప్పాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు