Viral news ప్రభాస్ – మారుతి సినిమా క్యాన్సిల్..?

Viral news

రెబల్ స్టార్ ప్రభాస్ అంటే గుర్తుకు వచ్చేవి పాన్ ఇండియా సినిమాలే. ఒకప్పుడు చకచకా సినిమాలు చేసి వదిలిన ప్రభాస్ ఎస్ఎస్ రాజమౌళితో బాహుబలి సినిమా ఏ క్షణంలో మొదలుపెట్టాడో ఆ తరువాత నుండి సినిమా, సినిమాకి చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. భారీ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల లిస్ట్ పెద్దగానే ఉంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ ఆశలన్నీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్, నాగ్ అశ్విన్ తో కల్కి సినిమాలపైనే పెట్టుకున్నాడు.

ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్దకు రావడానికి మరో ఏడాది సమయం పడుతుంది. ఈ సమయంలో మారుతీ దర్శకత్వంలో ఓ సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నాడు ప్రభాస్. హర్రర్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ భామ మాళవిక మోహన్ ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. రాజా డీలక్స్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు రూమర్స్ హల్చల్ చేశాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మారుతి సినిమాని ప్రభాస్ పక్కన పెట్టేసాడట. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ మేకర్స్ నుండి ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటనలు రావడం లేదని ఓ వార్త వైరల్ గా మారింది. అయితే నిర్మాత మాత్రం ఇప్పటికే ప్రభాస్ – మారుతి సినిమాపై పెద్ద మొత్తంలో ఖర్చు చేశాడట. ఇలాంటి సమయంలో ప్రభాస్ సినిమాని హోల్డ్ లో పెట్టడం వల్ల భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉందని.. అందువల్ల ఈ సినిమాని క్యాన్సిల్ చేశారంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఈ రూమర్స్ పై మూవీ యూనిట్ స్పందిస్తే కానీ అసలు విషయం ఏంటో తెలియదు

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు