Balakrishna: నేలకొండ “భగవంత్ కేసరి”. ఈ పేరు శానా ఏండ్లు యాదుంటది

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలకృష్ణ కొత్త సినిమా టీజర్ వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో “భగవంత్ కేసరి” అనే సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. విరామం లేకుండా శరవేగంగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. అయితే జూన్ 10న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు కానుక గా చిత్ర యూనిట్ “భగవంత్ కేసరి” టీజర్ ను విడుదల చేసారు.

భగవంత్ కేసరి అన్న టైటిల్ కింద “ఐ డోంట్ కేర్” అనే కాప్షన్ తో ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. ఇక టీజర్ లో బాలయ్య కి సంబంధించిన లుక్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా డైలాగ్ డెలివరీ ఇంతకు ముందు సినిమాల్లో కంటే మెరుగ్గా క్లియర్ గా ఉంది. “రాజు వాని వెనకాలున్న వందల మంది మందను చూపిస్తడు”, మొండోడు వానికున్న ఒకే ఒక్క గుండెను చూపిస్తడు”, అంటూ బాలయ్య డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. థియేటర్లో ఈ డైలాగ్ కే అరుపులే అని తెలిసిపోతుంది.

- Advertisement -

ఇక ఈ సినిమాలో బాలకృష్ణ ఒక మాజీ ఖైదీగా నటిస్తున్నాడని షర్ట్ మీదుండే నెంబర్ ని బట్టి అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ తెలంగాణ లో నెలకొండపల్లి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. నేలకొండ భగవంత్ కేసరి, ఈ పేరు శానా ఏండ్లు యాదుంటది” అంటూ తెలంగాణ యాసలో బాలకృష్ణ చెప్పే డైలాగ్ పూనకాలు తెప్పిస్తుంది. వీటికి తోడు థమన్ ఈ సినిమా కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉంది. ఇక ఈ సినిమా యొక్క నిర్మాణ విలువలు కూడా బాగా రిచ్ గా ఉన్నాయి. అయితే చాలా మంది ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు కాబట్టి ఎంటర్టైన్మెంట్ జోనర్ లో సినిమా తీస్తాడనుకున్నారు. కానీ ఈ సినిమాను నందమూరి అభిమానుల్ని మెప్పించేలా బాలయ్యకి తగ్గట్టుగానే తీసాడని అర్ధమవుతుంది.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా నటిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీ లీల కూడా మరో ప్రత్యేకపాత్రలో నటిస్తుంది. అయితే టీజర్ లో హీరోయిన్స్ ఎక్కడా కనిపించలేదు. ఇక భగవంత్ కేసరి సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహుగారపాటి, హరీష్ పెద్ది కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేస్తున్నామని మేకర్స్ తెలియచేసారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు