Vimanam : ఆ వ్యక్తితో తొమ్మిదేళ్ల పాటు రిలేషన్ లో ఉన్న అనసూయ..!

బుల్లితెర, వెండితెర సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు యాంకర్ అనసూయ. ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ షో ద్వారా ఎంతగానో ఫేమస్ అయింది. అంతేకాకుండా నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో ఓ పాత్రలో నటించి మెప్పించింది.

ఆ తరువాత రంగస్థలం సినిమాలలో రంగమ్మత్త పాత్రలో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఇక పుష్ప సినిమాలో దాక్షాయిని పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఈ పాత్ర అనసూయ జీవితాన్ని మార్చేసిందని కూడా చెప్పవచ్చు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మెల్లిగా బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి,సినిమాలలో బిజీ అయిపోయింది. అయితే ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ.. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొందట. ఆ విషయాలను ఈ ఇంటర్యూ లో బయటపెట్టింది. అనసూయ చిన్న వయసులోనే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కాదని పారిపోయి ఓ వ్యక్తితో తొమ్మిది సంవత్సరాలు లివింగ్ రిలేషన్ లో ఉందట. ఇద్దరూ ప్రేమించుకున్నారు కూడా. అలా 9 ఏళ్ల పాటు అనసూయ తను ప్రేమించిన వ్యక్తితో ఒకే గదిలో ఉండేదట.

ఆ తరువాత వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి అతడినే పెళ్లి చేసుకుంది. అతను ఎవరో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అతనే అనసూయ భర్త సుశాంత్ భరద్వాజ్. ఇక అనసూయ కి సినిమాలలో, యాంకరింగ్ రంగంలో ఆమె భర్త సుశాంక్ ఫుల్ సపోర్ట్ ఇచ్చినప్పటికీ, ఈమెకి పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత ఎప్పుడైతే జబర్దస్త్ లోకి అడుగు పెట్టిందో అప్పటినుండి ఈమె రేంజ్ మారిపోయి ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇటీవల రంగమార్తాండ, విమానం సినిమాలలో నటించి మెప్పించింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు