Meter : కిరణ్ అబ్బవరం లేటెస్ట్ ఫోటో షూట్ పై నెటిజన్ల కామెంట్స్

యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ, వెండితెరకి హీరోగా పరిచమైన కిరణ్ అబ్బవరం రెగ్యులర్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుండటం అందరికి తెలిసిన విషయమే. ఈ విధంగా ఈ యంగ్ హీరో ట్రోల్ అవడానికి అతను చేసే సినిమాలే కారణమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

రాజావారు రాణి గారు సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచమైన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఈ యంగ్ హీరోకి తెలుగులో మంచి సినిమా అవకాశాలే వచ్చాయి. కాకపోతే అన్ని సినిమాల్లో ఒకే విధమైన యాక్టింగ్, ఒకే విధమైన బాడీ లాంగ్వేజ్ మరియు సినిమాలు కూడా ఒకే రకమైన సినిమాలు చేయడం మూలాన, చేసిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. ఇటీవలనే వచ్చిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా కాస్త పరవాలేదనిపించిన, ఆ తరువాత వచ్చిన మీటర్ సినిమా డిజాస్టర్ తో మళ్ళీఈ యంగ్ హీరో కెరీర్ ఫ్లాప్ బాట పట్టింది.

ప్రస్తుతం కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. డీజే టిల్లు సినిమా ఫేం నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే కిరణ్ అబ్బవరం ఆశలన్నీ ప్రస్తుతం ఈ సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమా గనక ఫ్లాప్ అయితే కిరణ్ అబ్బవరం కెరీర్ చిక్కుల్లో పడినట్టే . ఈ విషయాన్నీ ముందే గమనించిన ఈ యంగ్ హీరో ఇటీవలనే ఒక ఫోటోషూట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోస్ చుసిన ట్రోలర్స్ అంత లుక్ మార్చావు, అలాగే చేసే సినిమాలు, యాక్టింగ్ కూడా మారిస్తే బ్రేక్ ఇవ్వడానికి రెడీ గా ఉన్నాం అంటూ యువత కిరణ్ అబ్బవరం పై మిమ్స్ వేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు