Pushpa 2: జన సైనికులు హర్ట్.. ఎఫెక్ట్ తప్పదా..?

Pushpa 2: నిన్నటితో ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల పోరు ముగిసింది.. అయితే ఇప్పటికీ కొన్నిచోట్ల తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొనడం ప్రజల్లో భయాందోళనలకు కలిగిస్తోందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయగా మరొకవైపు అల్లు అర్జున్ స్నేహితుడు నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించిన అల్లు అర్జున్ తర్వాత నంద్యాలలో ఉన్న తన స్నేహితుడిని నేరుగా కలిసి వైసిపికి మద్దతు ప్రకటించారు. దీంతో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా అభిమానులు అల్లు అర్జున్ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ చేసిన తీరు నచ్చకపోవడంతో ఎక్కడ చూసినా ఇప్పుడు అల్లు అర్జున్ పేరే హాట్ టాపిక్ గా మారుతోంది.

అల్లు అర్జున్ చేసిన పనికి తలలు పట్టుకుంటున్న నిర్మాతలు..

పవన్ కళ్యాణ్ ను కాదని బన్నీ వైసీపీకి మద్దతు ప్రకటించారు. దీంతో ఎక్కడ చూసినా సరే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అంటూ వార్ నడుస్తోంది.. బన్నీ చేసిన ఈ పనికి గానూ పుష్ప 2 ప్రొడ్యూసర్స్ ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు.. బన్నీ అలా చేయడంతో మెగా ఫాన్స్ జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. పైగా ఈ ప్రభావం పుష్ప 2 చిత్రంపై పడుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికే గత కొద్ది రోజులుగా మెగా , అల్లు ఫ్యామిలీ ల మధ్య ఇంటర్నల్ వార్ నడుస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక తాజాగా అల్లు అర్జున్ చేసిన పనితో రెండు కుటుంబాల మధ్య గట్టి వార్ నడుస్తోందని ఇప్పుడు బహిర్గతం అయింది. ఒకవైపు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మెగా అభిమానులు, మెగా ఫ్యామిలీ సినీ తారలు కూడా ప్రచారం చేస్తూ ఉంటే సొంత మామయ్యను కాదని బన్నీ వైసీపీకి ప్రచారం చేయడం ఇప్పుడు అటు సినీ ఇటు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు నాగబాబు కూడా అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ వక్రబుద్ధి చూపించాడు.

మెగా ఫాన్స్ హర్ట్.. మరి కలెక్షన్స్ సంగతి

Pushpa 2: Jana Sainikulu Hurt.. Is the effect wrong..?
Pushpa 2: Jana Sainikulu Hurt.. Is the effect wrong..?

ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా అభిమానులు తలుచుకుంటే ఎంత చిన్న సినిమా నైనా సరే పెద్ద హిట్ చేసేస్తారు.. బడా హీరో మూవీ నైనా డిజాస్టర్ లా మార్చే అంత శక్తి వారికి ఉంది.. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.. కాబట్టి పుష్ప 2 సినిమాని కన్నెత్తైనా చూస్తారా అన్న భయం అందరిలో మొదలైంది. మరోవైపు గ్లోబల్ స్టార్ గా మారిన బన్నీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అభిమానులు ఉన్నా సరే మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ సపరేట్.. గతంలో అల్లు అర్జున్ మాట్లాడుతున్న ఒక సినీ కార్యక్రమంలో మామయ్య పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటూ బన్నీని ఫ్యాన్స్ కోరగా.. దీనికి బన్నీ చెప్పను బ్రదర్ అంటూ రిప్లై ఇచ్చాడు. అప్పట్లో కూడా ఈ కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి.. అంతేకాదు బన్నీ ఇలా మాట్లాడడం వల్ల ఆయన నటించిన ఒక చిత్రానికి కలెక్షన్లు కూడా భారీగా పడిపోయాయని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు.. మరి ఇలాంటి సమయంలో అసలే పాన్ ఇండియా మూవీగా వస్తున్న పుష్ప 2 .. అందరి అంచనాలు దానిపై ఉన్నాయి.. కానీ ఈయన మాత్రం ఇలాంటి సమయంలో అలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా నిర్మాతలకు ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి..మరి పుష్ప 2 సినిమాపై ఈ ప్రభావం ఎంత మేరా పడుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు