Sharwanand: చిరు స్టైల్ లో బాలయ్యను పలకరించిన చరణ్

రామ్ చరణ్ సొసైటీ లో పది మందిలో ఎలా ఉంటాడో మనందరికి తెలిసిందే. తండ్రి లాగే నట వారత్వాన్ని కొనసాగిస్తూ, తండ్రి లా ఎదుటివారితో హుందా గా పలకరించడం అలవర్చుకున్న చరణ్ “డౌన్ టు ఎర్త్ పర్సన్” గా పేరు తెచ్చుకున్నాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వమన్నమాట. టాలీవుడ్ లో చిన్నపెద్ద అన్న తేడా లేకుండా అందర్నీ గౌరవిస్తాడు రామ్ చరణ్.

తాజాగా హైదరాబాద్ లో హీరో శర్వానంద్ పెళ్లి రిసెప్షన్ ఘనంగా జరిగింది. టాలీవుడ్ సెలబ్రిటీస్ తో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ఈ వెడ్డింగ్ కు హాజరయ్యారు. ఈ క్రమంలో శర్వానంద్ బెస్ట్ ఫ్రెండ్ అయిన రామ్ చరణ్ కూడా సతీ సమేతంగా విచ్చేశాడు. భార్య ఉపాసనతో కలిసి శర్వానంద్ దంపతులను విష్ చేయగా అనంతరం పక్కనే ఉన్న నందమూరి బాలకృషను పలకరించాడు. చిరంజీవి స్టైల్ లో నమస్తే చెప్తూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. గత కొన్నాళ్లుగా రామ్ చరణ్ బాలయ్యల మధ్య అనుబంధం కూడా బలపడుతుందనే చెప్పాలి. ఆ మధ్య ప్రభాస్ బాలయ్య అన్ స్టాపబుల్ షో కి వెళ్ళినపుడు బాలకృష్ణ తో రామ్ చరణ్ ఫోన్ లో మాట్లాడిన సంభాషణ బాగా వైరల్ అయ్యి ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది.

ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ వందేళ్ల వేడుకలో బాలకృష్ణ ఆహ్వానం మేరకు వచ్చిన రామ్ చరణ్ మరోసారి నందమూరి అభిమానుల మనసుల్ని గెలుచుకున్నాడు. తాజాగా శర్వా రిసెప్షన్ లో చరణ్, బాలయ్య ల పలకరింపులతో నందమూరి మెగా అభిమానులకి మంచి బూస్టప్ ని ఇచ్చింది. ఇక బాలయ్య భగవంత్ కేసరి సినిమాతో బిజీ గా ఉండగా, రామ్ చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్ లో బిజీ గా ఉన్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు