NBK109 : బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినిమా అఫీషియల్ లాంచ్ ఎప్పుడంటే ?

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడు. అతనెవరో కాదు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ. చాలా రోజుల నుంచి మోక్షజ్ఞ హీరోగా ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతాడా అని నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో ఈ సినిమాకి సంబంధించి రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది.

అయితే మోక్షజ్ఞ హీరోగా లాంచ్ చేయడానికి బాలకృష్ణ ఎప్పటి నుంచే ప్లాన్ చేస్తుండగా, మోక్షజ్ఞ చదువు కారణంగా ఈ సినిమా చాలా రోజులుగా వాయిదా పడుతూ వచ్చింది. దాంతో నందమూరి అభిమానులు నిరాశ చెందుతూ వచ్చారు.

ఇన్నాళ్లకి మోక్షజ్ఞ డెబ్యూ సినిమాపై క్లారిటీ రాబోతుంది. గతంలో మోక్షజ్ఞ ని హీరోగా పూరి జగన్నాథ్ లాంచ్ చేయబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి. ఆ తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమా ఉండొచ్చు అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ న్యూస్ లన్నింటికీ సమాధానంగా బాలయ్య, ఆ మధ్య తానే స్వయంగా దర్శకత్వం వహించి మోక్షజ్ఞ ని హీరోగా లాంచ్ చేస్తానని చెప్పడంతో వీటన్నికి తెర పడింది.

- Advertisement -

మోక్షజ్ఞ హీరోగా రాబోతున్న సినిమా గతంలో బాలకృష్ణ హీరోగా నటించిన ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్. వచ్చే సెప్టెంబర్ 9న మోక్షజ్ఞ పుట్టినరోజు వస్తుండటంతో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుందని సమాచారం. గతంలో కాస్త బొద్దుగా ఉండే మోక్షజ్ఞ ప్రస్తుతం బాడీ ఫిట్ నెస్ పై ఫోకస్ చేసినట్టు, ఆయన రీసెంట్ ఫోటోలు చూస్తే తెలుస్తుంది. తన ఫ్రెండ్స్ తో పర్సనల్ మోక్షజ్ఞ దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నందమూరి అభిమానులు మోక్షజ్ఞ చూడటానికి ఇప్పుడు హీరోల ఉన్నాడంటూ పోస్ట్ చేస్తూ.. వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు