Venky75: వెంకేటేష్ సినిమా పై వచ్చిన లేటెస్ట్ అప్డేట్

విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం “సైంధవ్”. శైలేష్ కొలను ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ దర్శకుడు ఇంతకు ముందు హిట్, హిట్ 2 చిత్రాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ గా ఆడియన్స్ ని అలరించాయి. ఇప్పుడు వెంకటేష్ తో సైంధవ్ ను చేస్తున్నాడు. ఈ సినిమాను ‘నిహారిక ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ లో వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నాడు.

సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా లో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధికి ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. తెలుగులో ఆయనకిదే మొదటి సినిమా. గత నెలలో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. అయితే సినిమా టైటిల్ తోనే మంచి హైప్ ఎక్కించాడు దర్శకుడు. “సైంధవ్”, అంటే మహాభారతం లో ఒక పాత్ర పేరు. పాండవులను వారి సైన్యాన్ని ఎదుర్కోవడానికి కౌరవుల తరపున తాను ఒక్కడే ముందుండి ఎదిరించినవాడు. దీన్ని బట్టి వెంకటేష్ ఒక్కడే సింగిల్ హ్యాండ్ తో విలన్స్ ని ఎదుర్కొంటాడని అర్థం. అలాగే విక్టరీ వెంకటేష్ కి ఇది 75 వ సినిమా.

ఇక తాజాగా చిత్ర యూనిట్ నుండి లేటెస్ట్ అప్ డేట్ అందింది.సైంధవ్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో సక్సెస్ ఫుల్ గా పూర్తయిందని మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ని ఈరోజు నుంచి వైజాగ్ లో తెరకెక్కిస్తున్నామని, ఈ సినిమా కి సంబంచిందిన మరిన్ని లేటెస్ట్ అప్ డేట్స్ ని త్వరలోనే తెలియచేస్తామని ప్రకటించారు. సైంధవ్ మూవీ ని క్రిస్మస్ కానుక గా 2023 డిసెంబర్ 22 న విడుదల చేస్తున్నామని మేకర్స్ ఇంతకు ముందే చెప్పడం జరిగింది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు