Nani: దసరా సినిమా పై మెగాస్టార్ స్పందన ఇదే.

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ల తో దూసుకుపోతుంది. ఇటు సెలబ్రిటీ ల ప్రశంసలు అందుకుంటుంది. ఈ మధ్యనే దర్శక ధీరుడు రాజమౌళి దసరా మూవీ పై తన అభిప్రాయాన్ని తెలియచేయడం జరిగింది. దసరా మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించాడు. శ్రీకాంత్ ఓదెల క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు కావడం విశేషం.

మరి భారీ అంచనాల నడుమ వచ్చిన దసరా సినిమా నాని కెరీర్ లోనే పెద్ద హిట్ కాగా, ఈ సినిమాపై లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి తన సాలిడ్ రెస్పాన్స్ ని ట్విట్టర్ ద్వారా చెప్పి చిత్ర యూనిట్ కి అభినందనలు అందచేశారు.

ఆ ట్వీట్ లో ఏముందంటే దసరా సినిమా చూసాను. మూవీ బ్రిలియెంట్ గా ఉందని, అలాగే నాని మేకోవర్ తో పెర్ఫామెన్స్ తో అదరగొట్టేసాడని అన్నారు. అలాగే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కి ఇది ఫస్ట్ సినిమా అంటే నమ్మశక్యంగా లేదని, చాలా బాగా డైరెక్ట్ చేశాడని అన్నాడు.

- Advertisement -

అంతే కాకుండా మహానటి కీర్తి సురేష్ తన జస్ట్ వావ్ అనిపించేలా చేసింది అని, అలాగే యంగ్ నటుడు దీక్షిత్ కూడా బాగా ఆకట్టుకున్నాడని చెప్పారు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్
మ్యూజిక్ కూడా అదరగొట్టాడని, మొత్తం చిత్ర యూనిట్ కి తన తరపున అభినందనలు తెలియచేస్తున్నానని అన్నారు. దసరా చిత్ర యూనిట్ కుడా వెంటనే స్పందించి మెగాస్టార్ కి కృతజ్ఞతలు తెలియచేశారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు