Gopichand :”రామబాణం” రిలీజ్ కి రెడీ

గోపీచంద్ హీరో గా, శ్రీవాస్ దర్శకత్వంలో వస్తోన్న “రామబాణం” సినిమా రిలీజ్ కి రెడీ అయింది. వరుస హిట్ లతో దూసుకుపోతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపిచంద్ కి జోడిగా ఖిలాడీ ఫెమ్ డింపుల్ హయతి నటిస్తోంది.

గోపిచంద్ , శ్రీవాస్ కాంబినేషన్ లో వస్తోన్న మూడో చిత్రం రామ బాణం. ఇప్పటికే షూట్ కంప్లిట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటుంది. వరుస ప్లాప్ లో సతమతమవుతున్న గోపీచంద్ మళ్ళీ తనకి బాగా కలిసొచ్చిన ఫ్యామిలీ, యాక్షన్ డ్రామాతో మన ముందుకి వస్తున్నాడు. గతంలో కూడా ఈయనకి ప్లాప్ వచ్చిన ప్రతిసారి ఫ్యామిలీ సినిమాలే హిట్ ఇచ్చి ఆదుకున్నాయి. అందుకే గత కొన్ని రోజులు గోపీచంద్ కి సరైన హిట్ లేకపోవడం తో మళ్ళి ఆ జానర్ నే నమ్ముకొని సినిమా కంప్లిట్ చేసాడు.

శ్రీవాస్ , గోపీచంద్ కాంబినేషలో వచ్చిన లక్ష్యం , లౌక్యం సూపర్ హిట్ లుగా నిలవడంతో ముచ్చటగా మూడోసారి వీళ్లిద్దరు కలిసి పని చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ షో లో ఈ సినిమా టైటిల్ ని బాలయ్య ఎనౌన్స్ చేసి టీం ని విష్ చేసాడు.నిర్మాంతార కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా వేసవి కానుకగా మే 5న ప్రేక్షకుల ముందుకి రానుంది.

- Advertisement -

శ్రీవాస్ బాలయ్యతో చేసిన డిక్టేటర్ సినిమా నిరాశ పరచడంతో శ్రీవాస్ కొంత గ్యాప్ తీసుకొని ఈ సినిమా చేసారు. గోపిచంద్ సినిమాలు కూడా వచ్చాయి అంటే వచ్చాయి అనే తరహాలోనే వచ్చి , వెళ్లిపోతున్నాయి తప్ప హిట్ కి నోచుకోవట్లేదు. మరి ఈ సినిమా తోనైనా వీళ్లిద్దరు కాంబో హ్యాట్రిక్ కాంబో అవుతుందో లేదో చూడాలి.ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుండటం తో సినిమా రిసల్ట్ పై యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇప్పటీకే మావి టీం ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు