Shaakuntalam: మినిమిమ్ బుకింగ్స్ లేవు.. ఇలా అయితే కష్టమే..

సమంత నటించిన శాకుంతలం సినిమా రేపు అనగా ఏప్రిల్ 14 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ‘గుణ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో స్వీయ నిర్మాణం లో ఈ సినిమాను తెరకెక్కించాడు. రుద్రమ దేవి తర్వాత 8 ఏళ్ళు గ్యాప్ తీసుకొని ఈ సినిమా ను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ఒక పీరియాడిక్ డ్రామాగా రూపొందింది. రెండేళ్ల పాటు తెరకెక్కించిన ఈ సినిమా పై గుణ శేఖర్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. దాదాపు 80 కోట్ల భారీ వ్యయం తో ఈ సినిమా ను నిర్మించాడు.

అయితే శాకుంతలం సినిమాకు సంబంధించిన నిర్మాణ విలువలు అంత రిచ్ గా మాత్రం లేవని ప్రీమియర్స్ చుసిన ఆడియన్స్ అంటున్నారు. గుణ శేఖర్ కాస్ట్యూమ్స్, సెట్టింగ్ ల పైన పెట్టిన దృష్టి ఈ మూవీ గ్రాఫిక్స్, మ్యూజిక్ పైన కూడా పెట్టి ఉండాల్సింది అని అంటున్నారు.

శాకుంతలం సినిమా విడుదలకు ఒకరోజు మాత్రమే టైమ్ ఉన్నా ఆన్లైన్ లో మాత్రం బుకింగ్స్ ఆశాజనకంగా లేవు. సిటీ లో ఒక్క థియేటర్ కుడా ఇంకా ఫుల్ కాలేదు. దీన్ని బట్టి శాకుంతలం పై పబ్లిక్ అంత ఇంట్రస్ట్ చూపించడం లేదని, రిలీజ్ అయినా తర్వాత టాక్ ని బట్టి చూద్దాం అని పబ్లిక్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఇక తెలుగు కాకుండా ఇతర భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్నది కుడా తెలియట్లేదు. 50 కోట్లకి పైగా బిజినెస్ జరుపుకున్న శాకుంతలం సినిమా తొలిరోజు కనీసం 10 నుండి 15 కోట్లు అయినా వసూలు చేయాలి. ఆన్లైన్ లో బుకింగ్స్ లేకున్నా ఆఫ్ లైన్లో అయినా ఈ సినిమా టిక్కెట్లు తెగుతాయో లేదో రేపు చూడాలి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు