Pawan : పవన్ కళ్యాణ్ మ్యూజిక్ డైరెక్షన్ లో త్రివిక్రమ్ హీరోగా చేస్తే ?

హెడ్ లైన్ తప్పుగా పడిందేమో అని మళ్ళి ఇంకోసారి చదివారా.. మీరు చదివింది నిజమే ! కాకపోతే పవన్ కళ్యాణ్ పేరు చదవాల్సిన ప్లేస్ లో అకీరా నందన్ అని , త్రివిక్రమ్ పేరు చదవాల్సిన ప్లేస్ లో మనోజ్ రిషి అని చదివితే చాలు. ఎందుకంటే పవన్ కొడుకు అకీరా , త్రివిక్రమ్ కొడుకు మనోజ్ రిషి కలిసి ఒక షార్ట్ ఫిలిం చేసారు. అది పైన మీరు చదివిన హెడ్ లైన్ ఆర్డర్ లోనే ఉంది.

హీరో కొడుకు హీరో అవ్వాలని లేదు, డైరెక్టర్  కొడుకు డైరెక్టర్ అవ్వాలని లేదు అని అనిపిస్తుంది మన స్టార్ట్ కిడ్స్ వ్యవహారం చూస్తుంటే. పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నైనా సరే , రాజకీయంగా నైనా త్రివిక్రమ్ హెల్ప్ లేకుండా పవన్ ఏ పని చేయడు. ఇంకా సూటిగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్పీచ్ లు కూడా త్రివిక్రమే రాస్తాడు అనే టాక్ కూడా ఉంది. అయితే ఇందులో తప్పు పట్టడానికి కూడా ఏమి లేదు ఎందుకంటే స్నేహితులన్నాక ఆ ఆమాత్రం అభిప్రాయాలూ కలవకుండా ఉంటాయా.. వాటి గురించి మాట్లాడుకోకుండా ఉంటారా. ఇక విషయానికొస్తే పవన్- త్రివిక్రమ్ ఎంత స్నేహితులో వాళ్ళ కొడుకులు కూడా అంతే మంచి స్నేహితులు.

అయితే రీసెంట్ ఈ ఇద్దరు స్నేహితులు కలిసి ఒక రైటర్స్ బ్లాక్ అని ఒక షార్ట్ ఫిలిం చేసారు. ఆ షార్ట్ ఫిలిం కి అకీరా మ్యూజిక్ అందించాడు. మనోజ్ రిషి యాక్టింగ్ చేసాడు. కార్తికేయ డైరెక్షన్ చేసాడు. గేమింగ్ ప్యాట్రన్ లో ఈ షార్ట్ ఫిలిం ని చేసారు మన అకీరా అండ్ మనోజ్. రైటర్స్ వాళ్ళకి ఐడియాస్ రానప్పుడు ఎలా ఫీల్ అవుతారు అనే కాన్సెప్ట్ తో చిన్న సెటప్ తో దీన్నిఫినిష్ చేసారు. మన త్రివిక్రమ్ గారి అబ్బాయి మనోజ్ యాక్టింగ్ చాలా బాగా చేసాడు. అలాగే మన పవర్ స్టార్ట్ పవన్ కొడుకు అకీరా కాన్సెప్ట్ కి సెట్ అయ్యే మ్యూజిక్ ని కంపోజ్ చేసాడు. అడవి శేష్ ట్విట్టర్ లో ఈ షార్ట్ ఫిలిం ని షేర్ చేస్తూ ఇద్దరినీ విష్ చేసాడు. 4.35 నిమిషాల నిడివి తో యూట్యూబ్ లో ఉంది. మరి మన పవర్ స్టార్ కొడుకు అకీరా అండ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కొడుకు మనోజ్ టాలెంట్ ఏంటో తెలియాలంటే వెంటనే ఈ షార్ట్ ఫిలిం చుడండి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు