Megastar: చిరంజీవి మామూలోడు కాదు.. మోజు పడిన మూడు రోజులకే..

మెగాస్టార్ చిరంజీవి.. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి మామూలు నటుడిగా ఎంట్రీ ఇచ్చి.. ఒకానొక సమయంలో ఇండస్ట్రీని ఏలే స్థాయికి ఎదిగారు. అలా ఎదిగే క్రమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఇక్కడి దాకా వచ్చారు. ఇప్పుడు ఆయన పేరు చెప్పుకొని పదిమంది హీరోలు ఇండస్ట్రీలోకి రావడానికి హెల్ప్ చేస్తున్నారు. సినిమాలపరంగా చిరంజీవి నెంబర్ 1 స్థానంలో దూసుకుపోతున్నారు. వరుసగా రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో మంచి ఊపు మీద ఉన్నాడు మెగాస్టార్. ఇదే క్రమంలో మరికొద్ది రోజులలో తాత కాబోతున్న చిరంజీవి తన మరో కోరికను నెరవేర్చుకున్నారు. చిరంజీవి లగ్జరీ ఐటమ్స్ కి దూరంగా ఉంటాడన్న విషయం మనకు తెలిసిందే. కానీ ఏదైనా నచ్చితే మాత్రం అది కొనాలని చూస్తారు. ఇటీవల ఓ కారును చూసి దానిపై మోజు పడ్డ చిరంజీవి.. కేవలం మూడు రోజుల్లోనే తన ఇంటి కాంపౌండ్ లో ఆ కారును ప్రత్యక్షం అయ్యేలా చేసుకున్నారు.

చిరంజీవి గ్యారేజీలో ఖరీదైన కార్లకు కొదవలేదు. ఆయన దగ్గర రోల్స్ రాయిస్ స్పెషల్ ఎడిషన్ ఉంది. ఇంకా బోలెడు లగ్జరీ కార్లు ఉన్నాయి. తాజాగా ఇందులో ఎన్నో అద్భుతమైన ఫ్యూచర్స్ కలిగిన అత్యాధునిక లగ్జరీ టయోటా వెల్ఫేర్ అనే కారు వచ్చి చేరింది. రాజసం ఉట్టిపడే ఈ కార్ షోరూమ్ ధర లైఫ్ టాక్స్ ధరలు అన్ని కలుపుకొని సుమారు 2.9 కోట్లు ఉంటుంది. అయితే ఈ కారుకు ఫ్యాన్సీ నెంబర్ అయిన 1111 కోసమే చిరంజీవి మరో రూ. 4.5 లక్షలు ఖర్చు చేయడం విశేషం. ఈ కొత్త కారుకు TS 09 GB 1111 అనే నెంబర్ ని కేటాయించారు. ఈ కారు చూసేవారికి కనువిందుగా కనిపిస్తున్నా.. డ్రైవ్ చేసే వాళ్లకు మాత్రం దిమ్మతిరిగిపోయేలా ఉంటుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు